Bed Charpai : నులక మంచానికి రూ.లక్షపైనే.. భారతీయ మంచాలకు అమెరికాలో ఫుల్‌ డిమాండ్‌!

. వీటి గురించి అమెరికా ఈకామర్స్‌ సంస్థలు గొప్పగా ప్రచారం చేస్తున్నాయి. “చాలా అందమైన డెకర్‌తో కూడిన సాంప్రదాయ భారతీయ మంచం”గా వర్ణిస్తున్నాయి.

  • Written By: Naresh
  • Published On:
Bed Charpai : నులక మంచానికి రూ.లక్షపైనే.. భారతీయ మంచాలకు అమెరికాలో ఫుల్‌ డిమాండ్‌!

Bed Charpai : భారత దేశంలోని పురాతన మంచాలకు అమెరికాలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికీ​గ్రామాల్లో ఉపయోగించే నులక, నవారా, ప్లాస్టిక్‌ అల్లికతో చేసిన మంచాలను వాడుతున్నారు. పట్టణాలకు వచ్చే సరికి డబుల్‌ కాట్‌ బెడ్స్‌, వివిధ డిసైన్లలో అభిస్తున్నాయి. అయితే పట్టణాలో ఉపయోగించే డబుల్‌కాట్‌ బెడ్‌ ధరతో సమానంగా పాతకాలం మంచాలను అమెరికాలోని ఓ ఈకామర్స్‌ సంస్థ ఆన్‌లైన్‌లో అమ్ముతోంది.

మనదగ్గర రూ.10 వేల లోపే..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే మంచాలా ధర ఇప్పటికీ మన దేశంలో రూ.10 వేల లోపే ఉంటుంది. మంచం తయారు చేసిన కర్రను బట్టి ధర ఉంటుంది. గరిష్టంగా రూ.10 వేలు మించదు. అమెరికాలోని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం వాటి అసలు విలువను మించి అధిక ధరలకు ఈ సాధారణ మంచాలను అమ్మకానికి పెట్టాయి. అమెరికన్ ఇ-కామర్స్ కంపెనీ అయిన ఈటీఎస్‌వై ఈ మంచాలా ధరను రూ.1,12,168గా పేర్కొంది. అయినా వీటిని అక్కడి జనాలు ఎగబడి కొంటున్నారు.

సంప్రదాయానికి ప్రతీక..
భారతీయ సంప్రదాయానికి ఈ మంచాలు నిదర్శనం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి గురించి అమెరికా ఈకామర్స్‌ సంస్థలు గొప్పగా ప్రచారం చేస్తున్నాయి. “చాలా అందమైన డెకర్‌తో కూడిన సాంప్రదాయ భారతీయ మంచం”గా వర్ణిస్తున్నాయి. చేతితో తయారు చేసిన ఈ మంచాలు చెక్క, జనపనార తాడు వంటి పదార్థాలను ఉపయోగించి రూపొందించబడిందని పేర్కొంటున్నాయి. అయితే ఇవి భారతదేశంలోని చిన్న వ్యాపారం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అమెరికా ఈకామర్స్‌ సంస్థలు మాత్రం వీటి విలువను భారీగా పెంచడం ఆలోచింపజేస్తోంది.

వివిధ పేరు‍్ల..
ఈ సాంప్రదాయ భారతీయ మంచం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ఆగ్నేయాసియా దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో దీనిని మాంజా, ఖాత్, ఖతియా లేదా మాంజి అని పిలుస్తారు. అయితే వీటికి అమెరికాలోని ఈకామర్స్‌ సంస్థలు బ్రాండ్‌ తగిలించి అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ పెద్ద కంపెనీ సాధారణ చెత్త డబ్బాల బ్యాగ్‌లతో పర్సును తయారుచేసి అధిక ధరలకు విక్రయిస్తోంది. ఆశ్చర్యకరంగా బ్రాండ్ ఈ బ్యాగ్ ధరను రూ.1.4 లక్షలుగా నిర్ణయించింది. ట్రాష్ బ్యాగ్‌ను పోలినప్పటికీ, బాలెన్సియాగా పర్సు ప్లాస్టిక్‌కు బదులుగా మృదువైన కాఫ్‌స్కిన్ లెదర్‌ను ఉపయోగించడం వల్ల విలాసవంతమైన టచ్‌ను జోడించడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇలా సాధారణ వస్తువులకు కూడా బ్రాండ్‌ తగిలించడం ద్వారా అమెరికన్లు ఎక్కువగా ఆదరిస్తున్నారు.

సంబంధిత వార్తలు