రాష్ట్ర చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డి చందు సస్పెన్షన్‌

మెగాభిమాని ముసుగులో క్రమశిక్షణారాహిత్యంతో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన బండ్రెడ్డి చందుని చిరంజీవి యువత, పవన్‌కళ్యాణ్‌ అభిమాన సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. చిరంజీవి అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న బండ్రెడ్డి చందు నియమనిబంధనలను ఉల్లంఘిస్తూ అనేకమార్లు మెగాభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడమే కాకుండా ఇటీవల సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు ఎల్‌. శ్యామ్‌ప్రసాద్‌ తెలియచేసారు. బండ్రెడ్డి చందుకి ఇకపై […]

  • Written By: Neelambaram
  • Published On:
రాష్ట్ర చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డి చందు సస్పెన్షన్‌

మెగాభిమాని ముసుగులో క్రమశిక్షణారాహిత్యంతో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన బండ్రెడ్డి చందుని చిరంజీవి యువత, పవన్‌కళ్యాణ్‌ అభిమాన సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.

చిరంజీవి అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న బండ్రెడ్డి చందు నియమనిబంధనలను ఉల్లంఘిస్తూ అనేకమార్లు మెగాభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడమే కాకుండా ఇటీవల సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు ఎల్‌. శ్యామ్‌ప్రసాద్‌ తెలియచేసారు.

బండ్రెడ్డి చందుకి ఇకపై చిరంజీవి యువత, మెగా కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టమౌతుంది.

 

సంబంధిత వార్తలు