Bandla Ganesh: తల్లీ బిడ్డా మొగుడు పెళ్ళాం ఎవరినైనా విడదీస్తాడు… త్రివిక్రమ్ టార్గెట్ గా బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్!
దీంతో అప్పుడప్పుడు తన అసహనాన్ని బయటపెడుతున్నాడు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ నిర్మాతగా మారాలని ఉందని ట్వీట్ చేశాడు. దానికి రిప్లై గా బండ్ల గణేష్ ‘గురూజీకి కాస్లీ గిఫ్ట్ ఒకటి సిద్ధం చేసుకో, నీ కోరిక తీరుతుంది’ అని ట్వీట్ చేశారు.

Bandla Ganesh: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తరచుగా టార్గెట్ చేస్తున్నాడు నిర్మాత బండ్ల గణేష్. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య కోల్డ్ నడుస్తుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక వీరి మధ్య గొడవలకు కారణమైంది. భీమ్లా నాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరించారు. ఆ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్ కి ఆహ్వానం అందలేదు. తనను వేడుకకు పిలవకపోవడం వెనుక త్రివిక్రమ్ ఉన్నాడని బండ్ల గణేష్ అన్నారు. త్రివిక్రమ్ ని బండ్ల దుర్భాషలాడుతున్న ఆడియో కాల్ లీకైంది.
అది నా వాయిస్ కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత అది నా వాయిస్సే, ఏదో కోపంలో ఒక మాటన్నాను. అంత మాత్రాన మా బంధం తెగిపోతుందా అన్నాడు. ఈ పరిమాణం పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ ని దూరం చేసింది. త్రివిక్రమ్ ని అమితంగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ మీద కోపంగా ఉన్నారట. బండ్లను దూరం పెట్టారట. ఈ వాదన బలపరుస్తూ గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్-బండ్ల గణేష్ కలవలేదు. బండ్ల గణేష్ ఆరాధించే పవన్ దూరం కావడానికి త్రివిక్రమ్ కారణమని బండ్ల గణేష్ నమ్ముతున్నాడు.
దీంతో అప్పుడప్పుడు తన అసహనాన్ని బయటపెడుతున్నాడు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ నిర్మాతగా మారాలని ఉందని ట్వీట్ చేశాడు. దానికి రిప్లై గా బండ్ల గణేష్ ‘గురూజీకి కాస్లీ గిఫ్ట్ ఒకటి సిద్ధం చేసుకో, నీ కోరిక తీరుతుంది’ అని ట్వీట్ చేశారు. మరో నెటిజెన్ ‘గురూజీకి కథ చెబితే స్క్రీన్ ప్లే రాస్తాను అని, అసలు కథ షెడ్ కి పంపిస్తాడని టాక్ ఉంది’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కి సమాధానంగా… అనుకుంటే తల్లీ కొడుకుల్ని భార్య భర్తలను గురుశిష్యులను వేరు చేయగలడు. అది మన గురూజీ స్పెషాలిటీ, అని కామెంట్ చేశాడు. తనను పవన్ నుండి వేరు చేసిన ఘనుడు త్రివిక్రమ్ అని బండ్ల గణేష్ ఇక్కడ పరోక్షంగా చెప్పాడు. పరిశ్రమలో త్రివిక్రమ్ కి గురూజీ అనే నిక్ నేమ్ ఉంది. ఆ నిక్ నేమ్ పేరున బండ్ల గణేష్ మాటల దాడికి దిగాడు. బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023