Bandla Ganesh: బిగ్ బ్రేకింగ్ : వైసీపీ పార్టీలోకి బండ్ల గణేష్.. ఇంతకి తెగించాడా!
అతని వల్లే నేను ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నానని, అతను నా దేవుడు అంటూ మైక్ దొరికితే ఊదరగొట్టేసే అలవాటు ఉన్న బండ్ల గణేష్, ఇప్పుడు తన మాస్కుని మెల్లగా ఇప్పుతున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ట్విట్టర్ లో కూర్చొని పరోక్షపు సెటైర్లు వేస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఆయనని నిర్మాతగా నిలబెట్టిన ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 11 ఏళ్ళు అయిన సందర్భంగా, కనీసం ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ కూడా వేసింది లేదు, పైగా నేడు వేరే రాజకీయ పార్టీ లోకి చేరబోతున్నాను అంటూ ట్విట్టర్ లో ఇతగాడు పెట్టిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Bandla Ganesh: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు , కేవలం అవకాశవాదులు నమ్మకద్రోహులు మాత్రమే ఉంటారు అని కొంతమంది చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన మాటలు రీసెంట్ గా జరుగుతున్న కొన్ని ఉదాహరణలను చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనం లాంటి వ్యక్తి బండ్ల గణేష్. ఇతను పేరు వింటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ
అతని వల్లే నేను ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నానని, అతను నా దేవుడు అంటూ మైక్ దొరికితే ఊదరగొట్టేసే అలవాటు ఉన్న బండ్ల గణేష్, ఇప్పుడు తన మాస్కుని మెల్లగా ఇప్పుతున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ట్విట్టర్ లో కూర్చొని పరోక్షపు సెటైర్లు వేస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఆయనని నిర్మాతగా నిలబెట్టిన ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 11 ఏళ్ళు అయిన సందర్భంగా, కనీసం ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ కూడా వేసింది లేదు, పైగా నేడు వేరే రాజకీయ పార్టీ లోకి చేరబోతున్నాను అంటూ ట్విట్టర్ లో ఇతగాడు పెట్టిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం, నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా, బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై.రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా’ అంటూ ఆయన కొన్ని ట్వీట్లు వేసాడు.
ఇదంతా నేడు పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు గురించి ఇచ్చిన ప్రసంగం తర్వాత వేసిన ట్వీట్స్. అంటే దాని అర్థం ఏమిటి?,త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీ లో చేరబోతున్నాడని అర్థం అంటూ అభిమానులు అనుకుంటున్నారు.ఆయన ట్వీట్స్ వేసిన టైమింగ్ అలాంటిది మరీ. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఏమిటి అంటే చిన్నపిల్లవాడిని అడిగిన చెప్తారు అది వైసీపీ పార్టీ అని. అంటే త్వరలోనే ఆయన వైసీపీ పార్టీ లో చేరబోతున్నాను అంటూ సంకేతాలు ఇచ్చినట్టే కదా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ బండ్లన్న ఏ పార్టీ లోకి దూరుతాడో, ఎలాంటి కామెడీ చెయ్యబోతున్నాడో చూడాలి.