Bandla Ganesh – Nara Lokesh : శత్రువులకంటే మన చుట్టూ తిరుగుతూ మితిమీరిన భజన చేసేవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.. వాళ్ళని అసలు నమ్మకండి అంటూ పెద్దలు ఊరికే చెప్పరు.. వాళ్ళ జీవితాల్లో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే చెప్తారు.. ఇలాంటి ఉదాహరణలు అన్నీ పవన్ కళ్యాణ్ విషయంలో బాగా కనిపిస్తాయి.
పవన్ కళ్యాణ్ నా దేవుడు.. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు.. ఆయన లాంటి నిజాయితీ పరుడుని ఎక్కడా చూడలేదు అంటూ భజన చేసే వాళ్లంతా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా మాత్రం ఒంటరిని చేసారు.. ఇప్పుడు ఆ జాబితాలోకి బండ్ల గణేష్ కూడా చేరిపోయాడు.. నేను పవన్ కళ్యాణ్ కి భక్తుడిని అంటూ మీకే దొరికితే ఊదరగొట్టే అలవాటు ఉన్న బండ్ల గణేష్, ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ విషయం లో చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు.. అభిమానులకు చిరాకు కలిగించేలా కావాలనే ఈమధ్య పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చెయ్యడం మొదలుపెట్టాడు.. ఇక ఈరోజు ట్విట్టర్ లో ఆయన చేసిన ఒకపని చూస్తే కావాలనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గెలుకుతున్నాడు అని అనిపించక తప్పదు.
ఇక అసలు విషయానికి వస్తే నేడు నారా లోకేష్ ‘యువ గళం’ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి పూనుకున్నాడు..తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుండి బయలుదేరాడు.. ఈ సందర్బంగా నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియచేస్తూ విజయం సాధించాలని విష్ చేసాడు..విష్ చెయ్యడం లో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు.. కానీ ఆయన దేవుడిలాగా కొలిచే పవన్ కళ్యాణ్ బస్ యాత్ర కోసం సిద్ధం చేసుకున్న ‘వారాహి’ బండికి నిన్న కొండగట్టు లో ఈరోజు ఇంద్రకీలాద్రి లో పూజా కార్యక్రమాలు చేయించాడు.. దీని గురించి బండ్ల గణేష్ ఉద్దేశపూర్వకం గానే పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూరాలని ఆశిస్తూ ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు.. దీనిపై పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.. వాళ్ళ కామెంట్స్ చూసి అయినా స్పందిస్తాడేమో అని అనుకుంటే అది కూడా జరుగలేదు..ఇలా ప్రవర్తించి అభిమానులకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.