Bandla Ganesh Politics: రాజకీయాల్లోకి బండ్ల గణేష్.. సంచలన ప్రకటన, ఇంతకీ ఏ పార్టీ?
బండ్ల గణేష్ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. లేదంటే నేను నాలుక కోసుకుంటా… అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో ఆయన కామెంట్స్ సంచలనం రేపాయి.

Bandla Ganesh Politics: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన సామాజిక, రాజకీయ అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. అలాగే నచ్చిన వ్యక్తులను పొగడటం, గిట్టని వారిని, నచ్చని వారిని తెగడడం చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ కి ఈయన వీరాభిమాని. దీంతో జనసేన పార్టీలో చేరాలని పవన్ అభిమానులు కోరుతుంటారు. అయితే బండ్ల గణేష్ నేను రాజకీయాల్లోకి రానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే కొందరిని తిట్టాలి, మరికొందరితో తిట్టించుకోవాలి. కొందరికి దూరం కావాల్సి ఉంటుంది. నాకు అందరూ కావాలి, అన్ని పార్టీల్లో నా సన్నిహితులు ఉన్నారు. కాబట్టి నేను రాజకీయాల్లోకి రాను.. అన్నారు.
కారణం ఏమిటో కానీ ఆయన వెర్షన్ మార్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. నా రాజకీయ భవిష్యత్ పై త్వరలో నిర్ణయం అంటూ వరుస ట్వీట్స్ వేశారు. రాజకీయాలంటే నీతి, నిజాయితీ. రాజకీయాలంటే కష్టం,రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ, పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. అందుకే నేను పాలిటిక్స్ లోకి వస్తున్నా అని ట్వీట్ వేశారు. బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
గతంలో బండ్ల గణేష్ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. లేదంటే నేను నాలుక కోసుకుంటా… అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో ఆయన కామెంట్స్ సంచలనం రేపాయి.మెల్లగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. బిఆర్ఎస్ నాయకులతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
ఇక రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన బండ్ల గణేష్ పార్టీ పేరు వెల్లడించలేదు. దీంతో మీరు ఏ పార్టీలో చేరుతున్నారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన జనసేనలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తో ఆయనకు చెడింది. దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలో తిట్టారు. త్రివిక్రమ్ మీద అనుచిత కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ ఆడియో ఫైల్ వైరల్ అయ్యింది. అప్పటి నుండి బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ దూరం పెట్టారు. ఇక బండ్ల గణేష్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
