Bandi Sanjay : నిర్మల్ జిల్లా చిట్యాల సమీపంలోని రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిసిన చిన్నారులతో కూడిన 20 కుటుంబాలు ఆయనతో సరదాగా గడిపారు. తమ కష్టా సుఖాలు పంచుకున్నారు. బండి సంజయ్ పై ప్రేమ, అభిమానంతో తమకు బండి సంజయ్ ని కల్పించాలని తమ పేరెంట్స్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చిన చిన్నారుల కోరికను ఆ తల్లిదండ్రులు తీర్చారు.
చిన్నారుల కోరిక విషయం బండి సంజయ్ దృష్టికి తెచ్చిన పలువురు బిజెపి నేతలు. వెంటనే స్పందించిన ఆయన ఆ పిల్లలను తనవద్దకు తీసుకురావాలని కోరారు. దీంతో… ఆ 20 కుటుంబాలకు చెందిన చిన్నారులకు… తనను కలిసే అవకాశం బండి సంజయ్ ఇచ్చారు.
బండి సంజయ్ ని కలిసి ఎంతో ఆనందానికి లోనైనా చిన్నారులు.. అరగంట పాటు వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. బండి సంజయ్ తో తమకు సంబంధించిన ఇష్టాలను చెప్పుకున్నారు.
చిన్నారుల చదువు, ఆటలు, అభిరుచులకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ .. వ్యక్తిగతంగా తమ పేరును పరిచయం చేసుకుని, కుటుంబాలతో కలిసి, ఫోటోలు దిగారు. చిన్నారులకు సంతోషం పంచారు.