Balakrishna: భయపడుతున్న బాలయ్య… ఆ కారణంతో కొత్త ఇంటికి షిఫ్ట్?
బాలకృష్ణ రంగురాళ్ల ధరిస్తారు. మెడలో, చేతికి తాయత్తులు కట్టుకుంటారు. చెప్పాలంటే మనిషి జీవితాన్ని నడిపించే అదృశ్య శక్తి ఏదో ఉందని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో బాలయ్య ఇల్లు మారుతున్నారన్న న్యూస్ సంచలనం రేపుతోంది.

Balakrishna: బాలకృష్ణకు విపరీతమైన సెంటిమెంట్స్. దైవభక్తి కూడా ఎక్కువ. వారాలు, నక్షత్రాలు, తిథులు అన్నీ నమ్ముతారు. యజ్ఞయాగాదులతో కోరుకున్నవి సమకూరుతాయని విశ్వసిస్తారు. సినిమా టైటిల్స్ విషయంలో కూడా ఆయనకు ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. టైటిల్ లో సింహ అని వస్తే… ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని భావిస్తారు. తారకరత్న ఆసుపత్రిలో ఉండగా బాలకృష్ణ మృత్యుంజయ యాగం చేయించారు. తన కొడుకు మోక్షజ్ఞకు నటనపై ఇష్టం లేని పక్షంలో మనసు మారాలని ప్రత్యేక పూజలు చేయించాడు.
బాలకృష్ణ రంగురాళ్ల ధరిస్తారు. మెడలో, చేతికి తాయత్తులు కట్టుకుంటారు. చెప్పాలంటే మనిషి జీవితాన్ని నడిపించే అదృశ్య శక్తి ఏదో ఉందని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో బాలయ్య ఇల్లు మారుతున్నారన్న న్యూస్ సంచలనం రేపుతోంది. పాత ఇంటిని వదిలి కొత్త ఇంట్లో అడుగుపట్టబోతున్నాడట. ఇందుకు వాస్తు కారణం అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటి వాస్తు సరిగా లేదని భావించిన బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడట.
జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసానికి సమీపంలో బాలయ్య కొత్త ఇల్లు ఉందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చెప్పాలంటే గత రెండేళ్లుగా బాలయ్య కెరీర్ గాడిన పడింది. అఖండ ముందు వరకు బాలయ్య చిత్రాలు దారుణ పరాజయం చూశాయి. ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. అఖండతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యాడు. అన్ స్టాపబుల్ షో ఆయనకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. పరిణామాలు చూస్తే బాలయ్యకు అనుకూలంగానే ఉన్నాయి. మరి బాలయ్య ఎందుకు ఇల్లు మారుతున్నాడనేది కొస మెరుపు. ప్రస్తుతం భగవంత్ కేసరి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ దర్శకుడు బాబీతో మూవీకి కమిట్ అయ్యాడు. ఇది బాలకృష్ణ 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.
