Nandamuri Balakrishna: టుడే మార్నింగ్ లైవ్ అప్ డేట్స్ కి వస్తే..
సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి బాలయ్య బాబు తన సతీమణి వసుంధరతో కలిసి ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లారు. .బాలయ్య అక్కాబావలైన పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీతో కలసి బాలయ్య ఈ సారి సంక్రాంతిను జరుపుకోబోతున్నారు. అందుకోసం రెండు రోజులు బాలయ్య ఇక్కడే గడపనున్నారు. నిజానికి ప్రతి ఏటా నందమూరి కుటుంబసభ్యులు కొందరు కారంచేడుకు వచ్చి పండుగ జరుపుకుంటున్నారు.

Nandamuri Balakrishna:
గతంలో కూడా బాలయ్య సతీమణి కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ.. బాలయ్య మాత్రం చాలా ఏళ్లుగా ఇక్కడికి రావడం లేదు. ఆయన ప్రతి ఏటా నారా వారి పల్లెలో పండుగ జరుపుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం పురందేశ్వరి ఇంటికి రావడం విశేషం. మరో టాపిక్ విషయానికి వస్తే.. యంగ్ బ్యూటీ దీప్తి సునైనా, షణ్ముఖ్ బ్రేకప్ పై షణ్ముఖ్ తండ్రి ఓ ఇంటర్వ్యూలోమాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ కలిసే ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే.. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ మాత్రం ఇంకా ఆమెకు బ్రేకప్ చెప్పలేదు. చెప్పే ఉద్దేశ్యం కూడా వాడికి లేదు.
Also Read: చైతులో పూర్తి మార్పుని చూస్తారు – నాగార్జున
ఇంకా షణ్ముఖ్ ఫాదర్ మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువ చర్చించకపోవడమే మంచిది. అయితే, వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుంది. అంతా శుభమే జరుగుతుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. షణ్నూ బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది.
మరో అప్ డేట్.. నాగచైతన్య, సమంత.. ఇటీవల వైవాహిక జీవితం విడిపోవడం ఈ డైరెక్టర్ కి ఇప్పుడు అతి పెద్ద సమస్య అయిపోయింది. చైతు. సామ్ కలిసి లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డితో ఓ సినిమా చేసేందుకు గతంలో ఒప్పుకున్నారు. అలాగే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఐతే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ మాజీ జంట ఈ లేడీ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చారట.
అలాగే మరో అప్ డేట్ తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో నటించిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరలో గరుడ వేగ-2 మూవీని తెరకెక్కించనున్నట్లు చెప్పుకొచ్చాడు.