Balayya 108 Movie First Look : బాలయ్య 108 ఫస్ట్ లుక్ రివ్యూ: అంచనాలకు మించి, ఈ విషయాలు గమనించారా?

Balayya 108 Movie First Look  : తెలుగు సంవత్సరాది ఉగాదికి టాలీవుడ్ ముస్తాబయింది. యంగ్ హీరోల నుండి టాప్ స్టార్స్, సీనియర్ స్టార్స్ వరకు అప్డేట్స్ తో క్యూ కట్టారు. ఉగాది పురస్కరించుకొని నేడు లెక్కకు మించిన సినిమా విశేషాలు మేకర్స్ పంచుకోనున్నారు. వాటిలో కొన్ని టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా స్పెషల్. ముఖ్యంగా బాలయ్య ఫస్ట్ లుక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టిన మూడు నెలలకే బాలయ్య ఫస్ట్ లుక్ తో […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Balayya 108 Movie First Look : బాలయ్య 108 ఫస్ట్ లుక్ రివ్యూ: అంచనాలకు మించి, ఈ విషయాలు గమనించారా?

Balayya 108 Movie First Look  : తెలుగు సంవత్సరాది ఉగాదికి టాలీవుడ్ ముస్తాబయింది. యంగ్ హీరోల నుండి టాప్ స్టార్స్, సీనియర్ స్టార్స్ వరకు అప్డేట్స్ తో క్యూ కట్టారు. ఉగాది పురస్కరించుకొని నేడు లెక్కకు మించిన సినిమా విశేషాలు మేకర్స్ పంచుకోనున్నారు. వాటిలో కొన్ని టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా స్పెషల్. ముఖ్యంగా బాలయ్య ఫస్ట్ లుక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టిన మూడు నెలలకే బాలయ్య ఫస్ట్ లుక్ తో రావడం ఆయన స్పెషాలిటీ. ఆయన ఎనర్జీ అలాంటిది మరి. దర్శకులను పరుగెత్తిస్తారు.

హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న బాలయ్య 108వ చిత్రం నుండి ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల చేశారు. ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఫస్ట్ లుక్ వుంది. బాలయ్య పాత్రలో మాస్ యాంగిల్ ఓ రేంజ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో బాలయ్య ఇలాంటి గెటప్ లో కనిపించలేదు. ఆయన లుక్ లో డీటెయిల్స్ వెతికితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మెడలో తాయత్తు, కోర మీసం, కండువా, చెవికి పోగు… ఈ ఫీచర్స్ ని బట్టి ఆయన కార్మిక నాయకుడు అయ్యే సూచనలు కలవు. రూత్ లెస్ లేబర్ లీడర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఆయన క్యారెక్టర్ రూపొందించారనిపిస్తుంది. ఇక పోస్టర్ మీద ‘ఈసారి మీ అంచనాలకు కూడా అందడు’ అనే కోట్ చూడవచ్చు. మొత్తంగా దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి ప్రయత్నం సక్సెస్.

గతంలో బాలకృష్ణ లుక్స్ విమర్శలపాలయ్యేవి. అఖండ నుండి ఈ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్థం అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి. ఫస్ట్ లుక్ తో కట్టిపడేయడం ద్వారా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు మించి NBK 108లో లుక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు