Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ కు ఐదు రెట్లు ఎక్కువ.. అ”ధర” హో అనేలా బండ్లగూడ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు!
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ విల్లాలోని వినాయక మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర కోటి 20 లక్షల పలికింది. ఈ లడ్డును అసోసియేషన్ ప్రతినిధులు కైవసం చేసుకున్నారు.

Balapur Ganesh Laddu Auction: గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశం మొత్తం ఒక ఎత్తు అయితే.. హైదరాబాదులో మరొక ఎత్తు. అతిపెద్ద భారీ గణపతికి ఖైరతాబాద్ ఆలవాలం అయితే.. లడ్డూ వేలంలో బాలాపూర్ గణపతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ప్రతి ఏడాది గణపతి నిమజ్జనం రోజున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ప్రత్యేకంగా చూసేది ఖైరతాబాద్ ను , బాలాపూర్ ను. ఎందుకంటే ఖైరతాబాద్ లో భారీ గణపతి విగ్రహ శోభాయాత్ర కన్నుల పండువగా జరుగుతుంది. అదే బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పోటాపోటీగా జరుగుతుంది. ఈసారి బాలాపూర్ లడ్డు ను మించి బండ్లగూడ ప్రాంతంలో ప్రతిష్టించిన గణపతి లడ్డూ వేలంపాటలో అమ్ముడుపోయింది. బండ్లగూడ జాగీర్ కీర్తి రీచ్ విల్లాలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డు ధర ఏకంగా కోటి 20 లక్షలు పలికింది.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ విల్లాలోని వినాయక మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర కోటి 20 లక్షల పలికింది. ఈ లడ్డును అసోసియేషన్ ప్రతినిధులు కైవసం చేసుకున్నారు. కాగా బాలాపూర్ వినాయకుడి లడ్డు గత ఏడాది 24.60 లక్షలు పలికింది. ఈ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ 27 లక్షలకు అమ్ముడు పోయింది. కానీ కీర్తి రిచ్ విల్లా లడ్డూ కోటి దాటడం విశేషం. బాలాపూర్ లడ్డుకు దాదాపు ఐదు గంటలకు బండ్లగూడ గణపతి లడ్డు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.
బండ్లగూడలో గత ఏడాది నిర్వహించిన వేలంలో 60.80 లక్షలకు లడ్డు అమ్ముడుపోయింది. ఈ ఏడాది కోటిని దాటింది. ఇక ఇదే వరుసలో మాదాపూర్ మై హోమ్ భుజ లో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ కు వేలం నిర్వహించగా చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి 25.50 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా లడ్డూ 18.50 లక్షలకు ధర పలికింది. ప్రతి ఏడాది బాలా పూర్ లడ్డూ ఎక్కువ ధర పలుకుతుంది. కానీ దాని రికార్డును బండ్లగూడ గణపతి లడ్డూ బ్రేక్ చేయడం విశేషం. బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
బాలాపూర్, బండ్లగూడ, మాదాపూర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. అక్కడి వ్యాపారులు పోటీపడి లడ్డూలను దక్కించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఈ ప్రాంతాల్లోనే గణపతి లడ్డూల వేలంలో సరి కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. వాస్తవానికి అందరూ కూడా బాలాపూర్ లడ్డు అధిక ధరకు అమ్ముడు పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ బండ్లగూడ గణపతి లడ్డు కోటి 20 లక్షలకు అమ్ముడుపోయింది. కాగా ఈ మూడు భారీ గణపతులను క్రేన్ల సహాయంతో నిమజ్జన వేదిక వద్దకు తరలిస్తున్నారు.
