Veera Simha Reddy 13 Days collection: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే విడుదలై బాలయ్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది..బాలయ్య గడిచిన ఇరవై ఏళ్లలో ఇలా బ్యాక్ తో బ్యాక్ సూపర్ హిట్స్ కొట్టడం ఇదే తొలిసారి..సంక్రాంతి విన్నర్ అవుతాడని అనుకున్న బాలయ్య రన్నర్ గా మిగిలినప్పటికీ కూడా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..సంక్రాంతి సెలవలు ఈ సినిమాకి సంజీవని లాగ పనిచేసింది..ఒకవేళ సంక్రాంతి లేకపోతే ఈ చిత్రం 50 కోట్లు కూడా వసూలు చేసి ఉండేది కాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..పండుగ దినాలలో బాగానే ఆడినప్పటికీ, మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం ఈ చిత్రం కనీసం స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..నిన్న ఈరోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేని విధంగా ఉన్నాయి..ప్రాంతాల వారిఁగి ఈ సినిమాకి 13 రోజులకు గాను ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

balakrishna
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 16.65 కోట్లు
సీడెడ్ 16.15 కోట్లు
ఉత్తరాంధ్ర 7.37 కోట్లు
ఈస్ట్ 5.52 కోట్లు
వెస్ట్ 4.13 కోట్లు
నెల్లూరు 2.88 కోట్లు
గుంటూరు 6.30 కోట్లు
కృష్ణ 4.60 కోట్లు
మొత్తం 63.60 కోట్లు
ఓవర్సీస్ 5.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.76 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 74.06 కోట్లు

balakrishna
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ నిన్నటితో రికవర్ అయిపోయింది..ఇక దానిపై ఎంత లాభాలు వస్తుంది అనేది రిపబ్లిక్ డే రోజు వచ్చే వసూళ్లను చూస్తే అర్థం అవుతాది..అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల వర్కింగ్ డేస్ లో చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి..ప్రస్తుతానికి ఈ సినిమా రెంటల్ బేసిస్ మీద థియేటర్స్ లో రన్ అవుతుంది కాబట్టి భారీ స్థాయిలో డెఫిసిట్స్ పడుతున్నాయి..ఇలాగే కొనసాగితే వచ్చిన షేర్ కి చిల్లు పడే అవకాశం ఉంది..అందుకే ఈ సినిమాని రేపటి నుండి కమిషన్ బేసిస్ మీద నడపడానికి చూస్తున్నారు..అలా చేస్తే కాస్త షేర్స్ కనపడుతాయని నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.