సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాల్లో లాగానే శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి మనుషుల్ని కలుపుకు పోతారు. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ కి అదే పరిస్థితి వచ్చింది. తన గత చిత్రం రూలర్ షూటింగ్ సమయంలో గొడవపడ్డ వ్యక్తి తోనే మరలా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 డిసెంబర్ ఇరవైన విడుదలయిన రూలర్ చిత్రం బాలయ్య బాబు చిత్రాల్లోనే ఒక డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. అవుట్ డేటెడ్ కథ తో వచ్చిన ఈ చిత్రం టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి విపరీతంగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ చిత్రం యొక్క అపజయానికి కారణమైన వాటిలో బాలకృష్ణ గెటప్ గురించి చెప్పక తప్పదు. దరిమిలా బాలయ్య ఆ చిత్రం యొక్క కెమెరామెన్ రామ్ ప్రసాద్ తో గొడవ పడటం జరిగింది. కట్ చేస్తే ఇపుడు బాలయ్య బాబు కొత్తగా బోయపాటి శ్రీను దర్శత్వంలో చేయబోయే చిత్రానికి రామ్ ప్రసాద్ ని కెమెరామెన్ గా ఎన్నిక చేయడం జరిగింది. దీనికంతటికి కారణం బాలయ్య బాబు చిత్రానికి పనిచేయడానికి వేరే కెమెరామెన్ ముందుకి రాకపోవడమే అని తెలిసింది.
NO RULES IN FILM AND POLITICS