Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం తన సినిమా టైటిల్ ని త్యాగం చేసేసిన బాలయ్య..ఎవరికీ తెలియని షాకింగ్ నిజం
ఈ సినిమాకి మొదట ‘బ్రో’ అనే టైటిల్ ని అనుకున్నారట. క్రింద క్యాప్షన్ ‘ఐ డోంట్ కేర్’. అప్పట్లో సోషల్ మీడియా లో కూడా ఈ టైటిల్ బాగా ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా ఇదే టైటిల్ ని అనుకున్నారట.

Pawan Kalyan : టాలీవుడ్ లో ఒక హీరో సినిమాకి సంబంధించిన టైటిల్ ని మరో హీరో కి ఇవ్వడం అనేది కొత్తగా ఏమి రాలేదు. ఎప్పటినుండో ఇది జరుగుతూనే ఉంది, రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కోసం తన ప్రొడ్యూసర్స్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ని ఇచ్చేసాడు. అసలు విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి మొదట ‘బ్రో’ అనే టైటిల్ ని అనుకున్నారట. క్రింద క్యాప్షన్ ‘ఐ డోంట్ కేర్’. అప్పట్లో సోషల్ మీడియా లో కూడా ఈ టైటిల్ బాగా ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా ఇదే టైటిల్ ని అనుకున్నారట. బాలయ్య ని దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా కలిసి రిక్వెస్ట్ చెయ్యడం తో తన నిర్మాతలను అడిగి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇచ్చేశాడట.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇప్పుడు బాలయ్య మరియు అనిల్ రావిపూడి సినిమాకి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్న ఈ టైటిల్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ‘బ్రో – ది అవతార్’ చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మరియు ఊర్వశి రౌతుల కాంబినేషన్ లో ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది.
