కొడుకు సినిమా కోసం బాలకృష్ణ అంత పని చేశాడా?

నటవిశ్వరూపం నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమా అరంగేట్రంపై తెగ తపన పడుతున్నాడట. దానికోసం బాలకృష్ణ మోక్షజ్ఞని ఎలా అయినా ఒక మంచి హీరోగా తీర్చిదిద్దలనే పనిలో పడ్డాడు. తన కొడుకుకి అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన లీ స్ట్రాస్బెర్గ్ ఫిలిం అండ్ థియేటర్ ఇంస్టిట్యూటులో కోచింగ్ ఇప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. మోక్షజ్ఞకు వివిధరకాల నటన కళలను నేర్పించాలనే ఉద్దేశంతో తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే నటనను నేర్చుకోవటం కోసం అంత దూరం పంపించాలా.. […]

  • Written By: Raghava
  • Published On:
కొడుకు సినిమా కోసం బాలకృష్ణ అంత పని చేశాడా?

నటవిశ్వరూపం నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమా అరంగేట్రంపై తెగ తపన పడుతున్నాడట. దానికోసం బాలకృష్ణ మోక్షజ్ఞని ఎలా అయినా ఒక మంచి హీరోగా తీర్చిదిద్దలనే పనిలో పడ్డాడు. తన కొడుకుకి అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన లీ స్ట్రాస్బెర్గ్ ఫిలిం అండ్ థియేటర్ ఇంస్టిట్యూటులో కోచింగ్ ఇప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. మోక్షజ్ఞకు వివిధరకాల నటన కళలను నేర్పించాలనే ఉద్దేశంతో తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే నటనను నేర్చుకోవటం కోసం అంత దూరం పంపించాలా.. అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాత ఎన్టీర్ గొప్ప నటుడు, బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు.. వీళ్ళు ఎవరు నటించటం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు.. కానీ ఇప్పడు మోక్షజ్ఞని శిక్షణ కోసం విదేశాలకు పంపుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మోక్షజ్ఞకి ఇన్ని రోజులు నటన రాదా.. అని జనాలు గుసగుసలు అడుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటె ఇంకో కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది.. అదేంటంటే.. మోక్షజ్ఞని జూ.ఎన్టీర్ కి ధీటుగా తయారుచేయాలని బాలకృష్ణ ప్రయత్నిస్తునాడట. నందమూరి వంశంలో..అప్పట్లో ఎన్టీర్.. ఇప్పుడు బాలకృష్ణ, జూ. ఎన్టీర్ మాత్రమే చెప్పుకోతగ్గ నటులుగా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ వయసు అయిపోతుంది.. కొన్ని సంవత్సరాలలో అతను సినిమాలు చేయటం ఆపేస్తాడు. ఇక మిగిలింది జూ. ఎన్టీర్ ఒక్కడే… తనని మినహాయించి నందమూరి వంశంలో వేరే ఎవరికీ ప్రజలలో అంత ఆదరణ లభించలేదు.

ఇప్పుడు బాలకృష్ణకి ఇదే పెద్ద సమస్య అయిందట. తన కొడుకు సినిమా అరంగేట్రం చేస్తే ప్రజలు జూ. ఎన్టీర్ ని ఆదరించినంత ఆదరిస్తారా..లేదా.. అనే భయం పట్టుకుందట. దీనిని అధిగమించాలంటే మోక్షజ్ఞను జూ. ఎన్టీర్ కన్న విలక్షణమైన నటుడిగా తయారుచేయాలి.. అందుకోసమే మోక్షజ్ఞను విదేశాలకు పంపి మరీ శిక్షణ ఇస్తున్నారనే వార్తలు జనాలలో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వార్తలు