Balakrishna vs Akkineni : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా ‘వీర సింహా రెడ్డి ‘ విజయోత్సవ సభ లో ‘అక్కినేని తొక్కినేని ‘ అంటూ చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే.. అక్కినేని అభిమానులు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేసారు.. బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ బాలయ్య దిష్టి బొమ్మలు దగ్ధం చేసారు.
పరిస్థితి చెయ్యిదాటిపోతోంది.. బాలయ్య బాబు రియాక్ట్ అయ్యి అక్కినేని ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తాడో లేదో అనుకున్నారు.. అయితే నేడు బాలయ్య మీడియా ముందుకి వచ్చి ఈ వివాదం పై స్పందించాడు. తొలిసారి తన వ్యాఖ్యలపై బాలయ్య స్పందించాడు. ఇదివరకు ఎంతో మందిని ఎన్నో సార్లు తిట్టినా కూడా బాలయ్య ఇలా వివరణ ఇవ్వలేదు. కానీ ఈసారి పెద్ద వివాదం కావడంతో బాలయ్య దానిపై స్పందించాల్సి వచ్చింది. గతంలో చిరంజీవి సహా పలువురిపై నోరుజారినా కూడా బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. ఈసారి మాత్రం స్పందించాడు.
బాలయ్య మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ANR రెండు కళ్లలాంటివారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు.. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాను.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను..’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘నాగేశ్వరరావు నన్నే ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునేవారు.. ఎందుకంటే నాగేశ్వరరావు పిల్లల దగ్గర ఆప్యాయత లేదు, నా దగ్గర ఉంది’ అంటూ బాలయ్య మరో దుమారం రేపారు. మరి బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.
Balayya responds on ANR controversy pic.twitter.com/pEZYxzAbbt
— Siddhu Manchikanti (@SiDManchikanti) January 26, 2023