Balakrishna: సింహరాశి.. ఇప్పటికీ టీవీలో వస్తే ఏడిపించే సినిమా. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ కూడా కొడుకుకు ప్రేమను పంచదు. అంతటి ఎమోషనల్ మూవీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన రాజశేఖర్ కు మంచి విజయంతోపాటు మంచి పేరును సంపాదించింది పెట్టింది.
కానీ ఈ ఎమోషనల్ స్టోరీని మొదట రాజశేఖర్ తో అనుకోలేదట దర్శకుడు వి. సముద్ర. ఈ సినిమాను పూర్తిగా నందమూరి బాలయ్యను బేస్ చేసుకొనే రాశాడట.. ‘సింహరాశి’ కథను పూర్తి చేసి నాడు ‘సమర సింహారెడ్డి’లాంటి ఫుల్ యాక్షన్ మాస్ మూవీ హిట్ కొట్టిన బాలయ్య వద్దకు వెళ్లి దర్శకుడు వి. సముద్ర వినిపించాడట.. కానీ ఈ కథను బాలయ్య రిజెక్ట్ చేశాడు.
సమర సింహారెడ్డి తర్వాత బాలయ్య ‘చెన్న కేశవరెడ్డి’, నరసింహనాయుడు లాంటి రాయలసీమ ఫ్యాక్షన్ పవర్ ఫుల్ కథలనే ఒప్పుకొని వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. నాడు చెన్నకేశవ రెడ్డి కథను డైరెక్ట్ చేయమని దర్శకుడు వి. సముద్రను కోరాడట.. ‘సింహరాశి’ మరీ సెంటిమెంటల్ సినిమా అని.. చెన్నకేశవరెడ్డిని తనతో తీయాలని విన్నవించాడట.. కానీ సముద్ర మాత్ర దాన్ని తిరస్కరించాడట..
ఇక చెన్నకేశవరెడ్డి కథను తయారు చేసిన వివి వినాయక్ తోనే బాలయ్య ఆ సినిమా తీశాడు. ఇక సముద్ర మాత్రం రిజెక్ట్ చేసిన ‘సింహరాశి’ మూవీ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తో తీసి బంపర్ హిట్ కొట్టాడు. ఆ ఏమోషనల్ మూవీ సముద్ర-రాజశేఖర్ లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ బాలయ్య ఈ మంచి సినిమా మిస్ చేసుకున్నానని అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుంటాడట.. కానీ మాస్ బాలయ్యకు.. ఈ ఎమోషనల్ ‘సింహరాశి’ సూట్ అయ్యేది కాదని.. బాలయ్య కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడని సినిమా చూస్తే తెలుస్తుంది.