Balakrishna 108 : డ్రైవర్ గా బాలకృష్ణ.. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే బ్లాక్ బస్టర్!
బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా అఖండ ఆయనకు మెమరబుల్ హిట్ అని చెప్పాలి. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సమయంలో హిట్ ట్రాక్ ఎక్కించింది.

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ శరవేగంగా 108వ చిత్రం పూర్తి చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య లుక్ ఆకట్టుకుంది. మెడలో కండువా, చెవులకు పోగులు, మీసం తిప్పి ఊరమాస్ అవతార్ లో కేక పుట్టించారు. బాలయ్య ఫ్యాన్స్ అద్భుతం అంటూ కొనియాడారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం నడుస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బాలయ్య పాత్రపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన కార్మిక నాయకుడు రోల్ చేస్తున్నారని ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య డ్రైవర్ రోల్ చేస్తున్నారట. ఆయన ఓ బస్ డ్రైవర్ గా కనిపించనున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. గతంలో బాలయ్య లారీ డ్రైవర్ గా చేశారు. దశాబ్దాల క్రితం విడుదలైన లారీ డ్రైవర్ మూవీ భారీ హిట్. విజయశాంతి-బాలయ్య కాంబో సూపర్ సక్సెస్ అయ్యింది.
మళ్ళీ ఇన్నేళ్లకు ఆయన డ్రైవర్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఊహాగానం మాత్రమే. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఆ రోజు ఎన్ బి కే 108 చిత్ర టైటిల్ అండ్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. అప్పుడు ఈ ఊహాగానాలపై స్పష్టత రావచ్చు. ఈ మూవీలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు.
ఇక బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా అఖండ ఆయనకు మెమరబుల్ హిట్ అని చెప్పాలి. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సమయంలో హిట్ ట్రాక్ ఎక్కించింది. దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి సత్తా చాటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ మూవీ తెరకెక్కించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి సైతం మంచి విజయం అందుకుంది.
