Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈమధ్య వివాదాల్లో బాగా చిక్కుకుంటున్నారు..మొన్నీమధ్యనే ‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న బాలకృష్ణ ఇప్పుడు లేటెస్ట్ గా నర్సులపై నోరుజారి కామెంట్ చేసిన విధానం పై ‘రాష్ట్ర నర్సింగ్ సంక్షేమ సంగం’ బాలయ్య తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తపరిచారు.

Balakrishna
అసలు విషయానికి వస్తే బాలయ్య వ్యాఖ్యాతగా ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో చేసిన చిట్ చాట్ ని విడుదల చేసారు..ఇందులో బాలయ్య పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ తనకి చిన్నతనం లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ గురించి ప్రస్తావిస్తూ వెంటనే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లారని,అక్కడ నర్స్ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడినట్టు అందరికీ అర్థం అయ్యింది.
దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సులు నిరసన కార్యక్రమం చేపట్టారు..బాలయ్య బాబు వెంటనే తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు, దీనిపై బాలయ్య బాబు తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా స్పందించాడు..ఆయన మాట్లాడుతూ ‘అందరికి నమస్కారం,నర్సులను నేను కించపర్చినట్టు కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.నా మాటలను కావాలనే వక్రీకరించారు,రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో అపారమైన గౌరవం.నేను స్థాపించిన బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.

Balakrishna
రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ..మీ నందమూరి బాలకృష్ణ’ అంటూ ఒక పోస్ట్ వేసాడు..అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.