
Balagam Collections
Balagam Collections: చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని అద్భుతాలను సృష్టించిన చిత్రం ‘బలగం’.ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని వొణికిపుచ్చుకొని అల్లిన కథ.
వెండితెర మీద చక్కటి హ్యూమర్ మరియు చక్కటి ఎమోషన్స్ తో వేణు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. అతనిలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రతీ ఒక్కరు ఈ సినిమాని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.అంత హాయిగా ఉంటుంది ఈ చిత్రం.50 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం తెలంగాణ ప్రాంతం నుండే 12 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఈమధ్య కాలం లో ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించిన సినిమానే లేదు.

Balagam Collections
తెలంగాణ ప్రాంతం లో అయితే రోజు రోజుకి షోస్ పెరుగుతూనే ఉన్నాయి, థియేటర్స్ పెరుగుతున్నాయి, కలెక్షన్స్ మొదటి రోజు కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటున్నాయి.నిన్న అనగా 15 వ రోజు ఈ సినిమాకి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.వీకెండ్ అవ్వడం , దానికి తోడు వచ్చిన రెండు కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఆడియన్స్ ఇప్పటికి మొదటి ఛాయస్ గా బలగం సినిమానే ఎంచుకుంటున్నారు.
ఇదే స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తే కేవలం నైజం ప్రాంతం నుండే 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఆంధ్ర పరేష్ మరియు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందా చూడాలి.