Balakrishna- Balagam Director Venu: నందమూరి బాలకృష్ణ తో ‘బలగం’ డైరెక్టర్ వేణు.. ఇదేమి కాంబినేషన్ రా స్వామీ!
బాలయ్య కి ఆ సబ్జెక్టు బాగా నచ్చడం తో వెంటనే సినిమా చెయ్యడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా తర్వాత ప్రారంభం అవుతుందా, లేదా బోయపాటి సినిమా తర్వాత మొదలు అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Balakrishna- Balagam Director Venu: రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ సెటప్ మామూలు రేంజ్ లో లేదు.కుర్ర డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేస్తూ రిటైర్ అయ్యే వయస్సు లో ఎవ్వరూ చూడని పీక్ రేంజ్ ని చూస్తున్నాడు. బోయపాటి శ్రీను తో ముచ్చటగా మూడవ సారి ‘అఖండ’ అనే చిత్రాన్ని తీసి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య, ఆ తర్వాత గోపీచంద్ మలినేని అనే మరో యంగ్ డైరెక్టర్ తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం తీసి మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు.
ఈ రెండు సినిమాలకు వచ్చిన షేర్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.ఇప్పుడు ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలం నుండి విరామం లేకుండా సాగుతుంది, ఇందులో శ్రీలీల బాలయ్య కి కూతురు గా నటిస్తుండగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగానే, మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట బాలయ్య. రీసెంట్ గానే ‘బలగం’ లాంటి గొప్ప సినిమా తీసి అటు కమర్షియల్ గా సక్సెస్ కొట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నావ్ జబర్దస్త్ కమెడియన్ వేణు బాలయ్య ని రీసెంట్ గానే కలిసి ఒక అద్భుతమైన కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టు ని వివరించాడట.
బాలయ్య కి ఆ సబ్జెక్టు బాగా నచ్చడం తో వెంటనే సినిమా చెయ్యడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా తర్వాత ప్రారంభం అవుతుందా, లేదా బోయపాటి సినిమా తర్వాత మొదలు అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కమెడియన్ నుండి నేడు బాలయ్య లాంటి పవర్ ఫుల్ స్టార్ తో సినిమా చేసే రేంజ్ కి ఎదిగాడంటే వేణు టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
