Samantha: సమంత అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. శాకుంతలం మూవీ మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోసారి శాకుంతలం వాయిదా వేశారు. నిజానికి గత ఏడాది నవంబర్ నెలలో శాకుంతలం విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. అనంతరం శాకుంతలం విడుదల వాయిదా వేశాము. కొత్త డేట్ తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. 2022 చివర్లో శాకుంతలం టీజర్ విడుదల చేశారు. అలాగే ఫిబ్రవరి 17 విడుదల తేదీగా ప్రకటించారు. సమంత అభిమానులు శాకుంతలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో మరోసారి ఉసూరుమనిపించారు. మరోసారి శాకుంతలం వాయిదా అంటూ ప్రకటన విడుదల చేశారు.

Samantha
శాకుంతలం ప్రకటించినట్లు ఫిబ్రవరి 17న విడుదల కావడం లేదు. ఈ విషయం చెప్పేందుకు చింతిస్తిస్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వలన శాకుంతలం అనుకున్న సమయానికి థియేటర్స్ కి రావడం లేదు… అంటూ నోట్ విడుదల చేశారు. ఈ క్రమంలో సమంత అభిమానులు అసహనం వ్వక్తం చేస్తున్నారు. విడుదల తేదీ ప్రకటించడం వాయిదా వేయడం ఎందుకు. ఒకేసారి అన్ని విషయాలు ప్రణాళిక వేసుకొని ఖచ్చితమైన విడుదల తేదీ ప్రకటిస్తే బెటర్. ఇలా ప్రతిసారీ వాయిదా వేయడం కరెక్ట్ కాదంటున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం వలనే శాకుంతలం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తుంది. దర్శకుడు గుణశేఖర్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్నారు. శాకుంతలం షూటింగ్ పార్ట్ చాలా త్వరగా కంప్లీట్ చేశారు. కారణం… చిత్ర యూనిట్ కాలు బయట పెట్టకుండా సెట్స్ లో చిత్రీకరణ జరిపారు. విజువల్స్ బేస్డ్ మూవీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించి రూపొందిస్తున్నారు. రూ. 50 కోట్లకు పైగా బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Samantha
లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఈ రేంజ్ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఇక శాకుంతలం పౌరాణిక గాథగా తెరకెక్కుతుంది. విశ్వామిత్రుడు-మేనకల కుమార్తె అయిన శకుంతలను దుష్యంతుడు ప్రేమిస్తాడు. ఈ కారణంగా ఆమె దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురౌవుతుంది. దుర్వాస మహర్షి శాపం కారణంగా శకుంతల అనేక కష్టాలు పడుతుంది. మొత్తంగా శాకుంతలం చిత్ర కథ ఇదే. దిల్ రాజు-గుణశేఖర్ నిర్మాణ భాగస్వాములుగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మోహన్ దేవ్, మోహన్ బాబు కీలక రోల్స్ చేశారు.
The theatrical release of #Shaakuntalam stands postponed.
The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/63GIFbK4CF
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2023