MLA Kethireddy Venkatarami Reddy : కేటురెడ్డికి బ్యాడ్ మార్నింగ్ .. పరువు తీసిన యువకుడి వీడియో వైరల్
ప్రధానంగా కార్యక్రమంలో ప్రశ్నలు, నిలదీతలనే హైలెట్ చేస్తున్నారు. ఓ యువకుడు నిలదీస్తున్నట్టు వీడియో ఒకటి ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది.

MLA Kethireddy Venkatarami Reddy : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఏపీలో ఆయన ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే. కానీ స్టేట్ లీడర్ కు మించి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. దానికి కారణం గుడ్ మార్నింగ్ ధర్మవరం. గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతకుముందు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి అంటే ఎవరో తెలియని వారు కూడా.. ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. కేవలం ఏపీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కేతిరెడ్డికి అభిమానులు ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే తమకు కూడా కావాలని కామెంట్స్ పెడుతుంటారు. దానంతటికీ కారణం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి.
కేతిరెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతం కావడం, అంతకు మించి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు నడుస్తుంటాయి., కేతిరెడ్డి విద్యాధికుడు కావడంతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట కార్యక్రామాన్ని ప్రారంభించారు. ఉదయాన్నే అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటేసుకొని వీధుల్లో తిరగడం, వారి సమస్యలను తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇలా తిరిగే క్రమంలో ప్రజల సమస్యల పరిష్కారం మాట దేవుడెరుగు కానీ.,. కేతిరెడ్డి మాత్రం సెలబ్రిటీ అయ్యారు. సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేయడంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు.
అయితే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట చేస్తున్న కార్యక్రమం పబ్లిసిటీ స్టంట్ అని టీడీపీ విమర్శలు చేస్తోంది. కేవలం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. కబ్జా చేయవచ్చో గుర్తించడానికే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తోంది. మొన్న ఆ మధ్యన జిల్లాలో యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేష్ కేతిరెడ్డి అవినీతి ఇది అంటూ సాక్షాధారాలతో వెల్లడించారు. దీనిపై కేతిరెడ్డి కూడా సవాళ్లకు దిగారు. అయితే అప్పటి నుంచి కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంపై కొద్దిపాటి అనుమానాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వ్యతిరేక ట్రోల్స్ మొదలయ్యాయి. కేటురెడ్డికి బ్యాడ్ మార్నింగ్ పేరిట రకరకాల ఫన్నీ వీడియోలు పెడుతున్నారు. ప్రధానంగా కార్యక్రమంలో ప్రశ్నలు, నిలదీతలనే హైలెట్ చేస్తున్నారు. ఓ యువకుడు నిలదీస్తున్నట్టు వీడియో ఒకటి ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది.
