Baby Movie First Review: ‘బేబీ’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మరో ‘ప్రేమిస్తే’ లాంటి సినిమా రాబోతోందా?
ఈ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గడిచిన రెండు దశాబ్దాలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విడుదలైన లవ్ స్టోరీస్ లో గుండెకు హత్తుకునే చిత్రాల జాబితా చాలా తక్కువగా ఉంటుంది, ఆ జాబితాలో ఈ సినిమా కూడా నిలిచిపోతుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళందరూ. ‘ప్రేమిస్తే’ చిత్రం ఎలా అయితే ఎన్నేళ్లు అయినా ఆడియన్స్ మదిలో చిరస్థాయిగా నిల్చిపోయిందో, ఈ చిత్రం కూడా అలా నిలిచిపోతుందని అంటున్నారు.

Baby Movie First Review: రీసెంట్ సమయం లో యూత్ ని కేవలం టీజర్ , ట్రైలర్ తోనే ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రాలలో ఒకటి ‘బేబీ’. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ‘కలర్ ఫోటో’ నిర్మాత సాయి రాజేష్ డైరెక్టర్ కాగా, ఎస్ కె ఎన్ నిర్మాతగా వ్యవరించాడు.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసినప్పుడే ఈ చిత్రం ఒక ట్రైయాంగులర్ లవ్ స్టోరీ అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది, హీరోయిన్ ని పూర్తిగా నెగటివ్ గా చూపించారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా మిత్రులకు మరియు సినీ ప్రముఖులకు వేసి చూపించారు.
ఈ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గడిచిన రెండు దశాబ్దాలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విడుదలైన లవ్ స్టోరీస్ లో గుండెకు హత్తుకునే చిత్రాల జాబితా చాలా తక్కువగా ఉంటుంది, ఆ జాబితాలో ఈ సినిమా కూడా నిలిచిపోతుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళందరూ. ‘ప్రేమిస్తే’ చిత్రం ఎలా అయితే ఎన్నేళ్లు అయినా ఆడియన్స్ మదిలో చిరస్థాయిగా నిల్చిపోయిందో, ఈ చిత్రం కూడా అలా నిలిచిపోతుందని అంటున్నారు.
ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కూడా, క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరోయిన్ పాత్రనే ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతుందట. ఇన్ని రోజులు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొచ్చిన వైష్ణవి చైతన్య, ఈ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అంటున్నారు, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.