Baba Ramdev : మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారట.. యోగాగురు రాందేవ్ బాబా రసికవేషాలు

Baba Ramdev : ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బాబాలు, గురుజీలు, స్వామీజీలు లైంగిక అత్యాచార నేరాల్లో దొరికి జైలు పాలవుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతటా వాళ్లే కనిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లలోనూ ఇదే స్వామీజీలు పాత్రధారులుగా ఉండడం విశేషం. అందుకే ఇప్పుడంతా బాబాల కాలం నడుస్తోంది. అయితే బాబా లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.వారికి సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. ముఖ్యంగా యోగా గురువు బాబా రాందేవ్ గురించి దేశంలో […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Baba Ramdev : మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారట.. యోగాగురు రాందేవ్ బాబా రసికవేషాలు

Baba Ramdev : ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బాబాలు, గురుజీలు, స్వామీజీలు లైంగిక అత్యాచార నేరాల్లో దొరికి జైలు పాలవుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతటా వాళ్లే కనిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లలోనూ ఇదే స్వామీజీలు పాత్రధారులుగా ఉండడం విశేషం. అందుకే ఇప్పుడంతా బాబాల కాలం నడుస్తోంది.

అయితే బాబా లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.వారికి సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. ముఖ్యంగా యోగా గురువు బాబా రాందేవ్ గురించి దేశంలో తెలియని వారు లేరు. యోగాతో ఫేమస్ అయిన రాందేవ్ తాజాగా మరోసారి నోరుజారారు. మహిళలపై అసభ్యకరంగా, కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య సమక్షంలోనే రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

యోగా శిబిరం ముగిశాక మహిళళకు చీరలు ధరించే సమయం దొరకలేదు. దీనిపై రాందేవ్ స్పందిస్తూ.. ‘మహిళలు చీర కట్టుకున్నా.. సల్వార్ సూట్స్ వేసినా నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం 10 ఏళ్లు వచ్చేవరకూ బట్టలే వేసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాబా రాందేవ్ ఈసారి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube