పిండి కొద్దీ రొట్టె

సాధారణం గా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో సినిమాల‌కు గ‌డ్డు కాల‌మే అనాలి. ఈ రెండు నెలల్లో దేశ‌వ్యాప్తంగా సినిమాలకు వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి ఈ స‌మ‌యంలో పిల్ల‌లంతా ప‌రీక్ష‌ల హ‌డావుడిలో ఉంటారు. పెద్ద‌లు వాళ్ల‌ను విడిచి థియేట‌ర్ల‌కు రారు. పైగా ఈసారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో మ‌రింత‌గా ఆక్యుపెన్సీ త‌గ్గి పోయింది. దరిమిలా ప్రేక్షకులు థియేటర్ లకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దాంతో థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కు స‌రిప‌డా ఖ‌ర్చులు కూడా రాని ప‌రిస్థితి […]

  • Written By: Neelambaram
  • Published On:
పిండి కొద్దీ రొట్టె

సాధారణం గా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో సినిమాల‌కు గ‌డ్డు కాల‌మే అనాలి. ఈ రెండు నెలల్లో దేశ‌వ్యాప్తంగా సినిమాలకు వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి ఈ స‌మ‌యంలో పిల్ల‌లంతా ప‌రీక్ష‌ల హ‌డావుడిలో ఉంటారు. పెద్ద‌లు వాళ్ల‌ను విడిచి థియేట‌ర్ల‌కు రారు. పైగా ఈసారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో మ‌రింత‌గా ఆక్యుపెన్సీ త‌గ్గి పోయింది. దరిమిలా ప్రేక్షకులు థియేటర్ లకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దాంతో థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కు స‌రిప‌డా ఖ‌ర్చులు కూడా రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక తెలుగులో కొత్త సినిమాల ప‌రిస్థితి మరింత ద‌య‌నీయంగా మారింది. ద‌క్షిణాదిన ఇత‌ర భాషా చిత్రాల ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కానీ ఇలాంటి అన్ సీజ‌న్లో కూడా ఓ హిందీ సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ప్రముఖ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ కొడుకు టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ న‌డియాడ్‌వాలా నిర్మించిన చిత్రం బాఘీ – 3. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల్ని అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశించారో అవన్నీ సినిమాలో ఉండటం తో ప్రేక్షకులు బాఘీ 3 చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. క‌థ ఏమంత గొప్పగా లేక పోయినా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని యాక్ష‌న్ ఘ‌ట్టాలు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. ఇలాంటి యాక్ష‌న్ సినిమాలు చాలానే వ‌చ్చినా.. ఈ స్థాయి ఆక్షన్ మాత్రం ఇప్ప‌టిదాకా చూసి ఉండ‌క పోవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ చిత్రం వార్‌ను మించిన యాక్ష‌న్ ఈ చిత్రం లో ఉంది. పూర్తి అన్ సీజ‌న్లో రిలీజై కూడా తొలి రోజు ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా రూ.18 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ల‌లో కూడా సినిమా భారీగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది . శ‌ని, ఆదివారాల్లో కూడా ఈ సినిమాకు భారీగా వ‌సూళ్లు వచ్చాయి.మొత్తం మీద ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస‌ర్ల‌లో ఒక‌టిగా బాగి-3 చిత్రం నిలిచే అవ‌కాశ‌ముంది.
Where there is a will there is the way

సంబంధిత వార్తలు