RRR Award : ఆర్ ఆర్ ఆర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఈ మూవీకి విశేష ఆదరణ దక్కుతోంది. పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఆర్ ఆర్ ఆర్ మూవీ గెలుచుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీలో సాటర్న్ అవార్డు గెలుచుకుంది. గతంలో రాజమౌళి బాహుబలి 2 చిత్రానికి ఈ అవార్డు అందుకున్నారు. రాజమౌళిని సాటర్న్ అవార్డు రెండు సార్లు వరించింది. దానికి రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో చేరింది. సన్ సెట్ సర్కిల్స్-2022 అవార్డ్స్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది.
బెస్ట్ ఫీచర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ సన్ సెట్ సర్కిల్ -2022 అవార్డు అందుకుంది. ఈ విభాగంలో నాలుగు అంతర్జాతీయ చిత్రాలు పోటీపడ్డాయి. జ్యూరీ సభ్యులు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఈ రెండు విభాగాల్లో రన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆస్కార్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆస్కార్ నామినేషన్స్ కి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. దీంతో జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకునేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. 15 విభాగాల్లో నామినేషన్స్ కోసం అప్లై చేశారు. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటున్న చిత్రానికి అధికారికంగా భారత్ నుండి ఆస్కార్ నామినేషన్ దక్కకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అలాగే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ దుమ్మురేపుతోంది. యూఎస్ లో 14 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకెళుతోంది. ఐదు వారాల రన్ పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ బ్రేక్ చేసింది. ¥ 305 మిలియన్ వసూళ్లతో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలిచింది. జపాన్ లో రజినీకాంత్ నటించిన ముత్తు ¥ 400 మిలియన్ వసూళ్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.