Avocado Benefits: లైంగిక సామర్థ్యం పెంచే పండు.. ఇది తింటే సంతోత్పత్తి
నిత్యం కడుపు నిండడానికి అన్నంతో పాటు కొందరు చపాతీలు తింటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఎనర్జీని ఇస్తూ తృప్తిని ఇస్తాయి. కానీ నేటి కాలంలో ఉన్న ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవ్వవు.

Avocado Benefits: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడి తో కలిగి ఉన్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు తమ పనుల్లో మునిగి సొంత ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన వారిలో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఓ వైపు కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపు ఉద్యోగ, వ్యాపార బాధ్యతలు నిర్వహించాలి. ఈ రెండింటి దాంట్లో ఏదీ బ్యాలెన్స్ తప్పినా జీవితం ఆగమ్యగోచరంగా మారుతుంది. ఈ క్రమంలో చాలామంది రెండు నిర్వహించడానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా వచ్చే ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం కొందరిలో సంతానలేమి సమస్యకు దారి తీస్తుంది. వాతావరణ కాలుష్యం తో పాటు మనసులో అనేక ఒత్తిడి కారణంగా శృంగార కణాలు బలహీనపడి సంతానలేమి సమస్యలకు దారి తీస్తాయి. ఇటువంటి వారు సాధారణ ఆహారం కన్నా ఈ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అవేంటంటే?
నిత్యం కడుపు నిండడానికి అన్నంతో పాటు కొందరు చపాతీలు తింటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఎనర్జీని ఇస్తూ తృప్తిని ఇస్తాయి. కానీ నేటి కాలంలో ఉన్న ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవ్వవు. ఈ తరుణంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో పండ్లు తీసుకోవడం మేలు. ఫ్రూట్స్ లో అనేక విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. పండ్లను తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లయి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తాయి. కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలను దరిచేరకుండా కాపాడుతాయి. అయితే సంతాన లేమి సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
భారత మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఎక్కువగా కనిపిస్తున్న ప్రూట్ ఆవకాడో. మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఈ ఫ్రూట్ ను వెన్న పండు అని అంటారు. గుడ్డు ఆకారాన్ని పోలిన ఇది పైన గ్రీన్ ఉండి లోపల వైట్ తో కూడిన గుజ్జు ఉంటుంది. ఇందులో కార్పోహైడ్రెట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ, బీటా కెరోటిన్ లతో పాటు మెగ్నీషియం ఖనిజం లభిస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగుతుంది. మార్కట్లో అన్ని కాలాల్లో విరివిగా లభించే ఫ్రూట్స్ అంజీర. వీటినే అత్తిపండ్లు అని కూడా అంటారు. ఇవి సంతానోత్పత్తికి దివ్యౌషధంగా చెబుతారు. వీటిని పాలల్లో వేసుకొని తినడం వల్ల టేస్టీగా ఉంటాయి.
రక్తహీనతను తొలగించే పండ్లలో ధానిమ్మ ఒకటి. డెంగ్యూ వచ్చన వారికి ఎక్కవగా వీటి జ్యూస్ తాగాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. దీంతో కొన్ని సీజన్లలో వీటికి డిమాండ్ ఉంటుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సంతానోత్పత్తి సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఫ్రూట్. స్ట్రాబెర్రీలు మన దగ్గర తక్కువగా విక్రయించినా.. ఇవి కనిపించినప్పుడు అస్సలు వదలొద్దు. విటమిన్ సి, పోటాషియం, మెగ్నీషియం లు ఉండే ఇది లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
