MP Avinash Reddy : మరో రెండు రోజుల పాటు అవినాష్ యాక్షన్ సిక్వెల్
రోసారి విచారణకు వస్తానని సీబీఐకి ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్‌రెడ్డి తల్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె దగ్గర అవినాష్ వున్నారు.

MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి యాక్షన్ సిక్వెల్ ఆగడం లేదు. అటు సీబీఐ అరెస్ట్ చేయడం లేదు. ఇటు ఎల్లో మీడియా అతి తగ్గడం లేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో రాష్ట్ర ప్రజలకు రోత పుడుతోంది. విచారణలు, అరెస్టులు, కోర్టు కేసుల హడావుడితో ప్రజలు కూడా అయోమయానికి గురవుతున్నారు. ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్ట్, అదిగో అరెస్ట్ అంటూ హైడ్రామా కొనసాగుతోంది. ఇది మరికొన్నిరోజుల పాటు సీరియల్ లా కొనసాగే చాన్స్ కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ పిటీషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన తాజా వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో రెండు రోజులు దాటితే అవినాష్ రెడ్డి సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనని భావిస్తున్నారు. అదే సమయంలో ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది.
ఎంపీ అవినాష్ రెడ్డి వరసుగా సీబీఐ విచారణలకు గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, మరోసారి విచారణకు వస్తానని సీబీఐకి ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్‌రెడ్డి తల్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె దగ్గర అవినాష్ వున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు సీబీఐ అధికారులు వెళ్లడం, ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్, కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ ఎల్లో మీడియా నానా హడావుడి చేసింది. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
అయితే ఈ ఎపిసోడ్ మరో రెండు రోజుల పాటు గడువు పెంచుకుంది.ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును అవినాష్‌రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అవినాష్ పిటిషన్‌పై ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించడానికి ప్రయత్నించగా ధర్మాసనం అంగీకరించలేదు.కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లదలుచుకోలేదని, ఏదైనా చెప్పాలని అనుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకి వెళ్లాలని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీలేకపోయింది. అంటే అవినాష్ రెడ్డి విషయంలో తదుపరి యాక్షన్ సిక్వెల్ 25 వరకూ కొనసాగుతుందన్న మాట. అయితే సగటు ఏపీ పౌరుడు మాత్రం ఈ ట్విస్టులతో తెగ హైరాన పడుతున్నాడు.