Avatar 2 Trailer: ‘టెర్మినేటర్’ మూవీతో భవిష్యత్ ని ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ తో కొత్త లోకం సృష్టించాడు. జేమ్స్ కామెరూన్ మదిలో రూపుదిద్దుకున్న పండోర గ్రహం నిజంగా ఉంటే చచ్చే లోపు ఒక్కసారి చూడాలి అనిపించేలా ఉంటుంది. వింత జంతువులు, చీకట్లో వెలుగులు విరజిమ్మే అడవులు, గాల్లో తేలే కొండలు, దగ్గరగా కనిపించే గ్రహాలు. సృష్టికర్త కూడా కుళ్ళుకునేలా పండోరా గ్రహాన్ని కామెరూన్ తీర్చిదిద్దాడు. 2009లో విడుదలైన అవతార్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పండోరా గ్రహ అనుభవాలు థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు అనుభవించాడు. జేమ్స్ కష్టానికి అద్భుత సృష్టికి ప్రేక్షకులు అదే స్థాయిలో తిరిగి చెల్లించారు.

Avatar 2 Trailer
$ 2.9 బిలియన్స్ రాబట్టి ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్ అవతరించింది. అవతార్ విడుదలైన 13ఏళ్ల తర్వాత సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ విడుదల అవుతుంది. విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గకుండా ఉంది. ఈసారి జేమ్స్ సముద్ర లోతుల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నారు. విశాల సాగరాన్ని యుద్ధ వేదికగా చేశాడు. ఆడియన్స్ ఫస్ట్ పార్ట్ కి మించిన అనుభూతి పార్ట్ 2 తో ఫీల్ అవ్వాలనేది జేమ్స్ కోరిక. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారని ట్రైలర్ తో అర్థమవుతుంది.
అవతార్ 2 కోసం ఆయన కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. అవతార్ చిత్రానికి మోషన్ క్యాప్చర్ 3డీ టెక్నాలజీ వాడారు. థియేటర్స్ లో ప్రేక్షకులను ఊహల్లో విహరించేలా చేశారు. సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ ప్రధానంగా నీటిలో సాగనుంది. కామెరూన్ నీళ్లలో సన్నివేశాల చిత్రీకరణ కోసం మో-క్యాప్ టెక్నాలజీ కనిపెట్టినట్లు సమాచారం. 9 లక్షల గ్యాలన్స్ వాటర్ తో ఒక సముద్రాన్ని తలపించే ట్యాంక్ క్రియేట్ చేశారు. అందులోనే అండర్ వాటర్ సన్నివేశాలు చిత్రీకరించారు. సహజంగా సముద్రంలో ఉండే పరిస్థితులు సృష్టించారు. సినిమా పట్ల కామెరూన్ కి ఉన్న డెడికేషన్ కి ఇది నిదర్శనం. 40 ఏళ్ల కెరీర్లో కామెరూన్ కేవలం 8 చిత్రాలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన డెడికేషన్, పెర్ఫెక్షన్ ఎలాంటిదో.

Avatar 2 Trailer
ఇక అవతార్ 2 ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నారు. ఫైనల్ కట్ లో మూవీ మరింత ఉన్నంతగా, ఊహకు మించిన విజువల్స్ కలిగి ఉంటుంది అంటారు. అవతార్ ఎడిటింగ్ పార్ట్ ఇంకా చాలానే మిగిలి ఉంది అంటున్నారు. ఈ డిసెంబర్ లో మూవీ లవర్స్ థియేటర్స్ నుండి నేరుగా పండోర గ్రహానికి పయనం కావడం ఖాయం . జేక్ సల్లీ తో కలిసి సాహస పోరాటాలు, అద్భుత ప్రయాణాలు చేయడం లాంఛనమే అంటున్నారు. అవతార్ రికార్డ్స్ అవతార్ 2 బద్దలు కొట్టే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.