రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే చంద్రబాబు కేంద్రంలోని బీజేపీపై పోరు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య కటీఫ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ నేతల వద్ద తెలుగు దేశం పార్టీ ప్రస్తావనను పదే పదే చేస్తున్నారు. వైసీపీ లేని కూటమి కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీని కలుపుకొని వెళితే లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారట. రాష్ట్రంలో గురుతర బాధ్యతను పవన్ తీసుకున్నా, బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి వెళ్తానని బహిరంగంగా చెప్పడం లేదు. ఆహ్వానిస్తే ఆలోచన చేస్తామని అంటోంది.
వలంటీర్లపై పక్కా ఆధారాలతో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది వలంటీర్లు చేస్తున్న ఆకృత్యాల వల్ల మొత్తం ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. దీనిపై వలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయించినా, పవన్ కల్యాణ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన చేపట్టిన వారాహి యాత్రలో మరోసారి వలంటీర్ల అంశంపై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల డేటా మొత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఏజెన్సీ వద్ద ఎందుకుంది? ఎలా వెళ్లిందో జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ (NSW) రాష్ట్ర జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో భాగస్వామి కలిగి ఉంది. స్మిత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఎమ్మెల్సీకి సంబంధించి వచ్చే ఏడాది ప్రారంభంలో ఎటువంటి మ్చాచ్ లు లేవు. జూన్‌లో కరీబియన్లతో, ఆగస్టు చివరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 ఆడవల్సి ఉన్నది. యునైటెడ్ స్టేట్స్‌లో T20 ప్రపంచ కప్ తర్వాత మొదటి షెడ్యూల్ వెలుడనుంది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైన తరువాత ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోంది. ఆయన బహిరంగ సభ ఏర్పాటైన ప్రతీచోట వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై విరుచుకుపడుతున్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించిన వైసీపీ సోషల్ మీడియా అదేదో ఘోరాతిఘోరమైన అంశంగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ వ్యూహాత్మక మౌనం ప్రదరిస్తోంది. కేంద్రంలోని బీజేపీ కూడా ప్రేక్షక పాత్ర పోషించడంపై జనసైనికులు మండిపడుతున్నారు. కేంద్ర రిపోర్టు మేరకే తాను స్పందించానని పవన్ అన్నారు.
షర్మిలకు మీడియా ప్రతినిధులు ఎవరూ కనబడకపోవడంతో విషయమేంటని ఆరా తీసింది. ఎవరయ్యా.. అలా చేయమని చెప్పింది అంటూ తన స్వంత మీడియాతో పలువురు మీడియా వారిని రావాలని ఆహ్వానించింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడే ఆమె ఆస్తి పంపకాల పత్రాలను తన కూతరు, కొడుకు పేరు మీద బదలాయించింది. ఈ ఒక్క ఘటన చాలదా అన్నా, చెల్లెలు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోబోతున్నాయన్నది అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
TDP- Congress: తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల ఘోర ఓటమి పాలైంది. పది సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో చేరుక కాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్న ప్రతీసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంసిద్ధమవుతున్నారు. ఈ సారి గతం కంటే ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నా, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో […]
నిన్నా మొన్నటి వరకు బీజేపీకి ఎదురు లేదని అనుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్నామ్నాయంగా అవతరించింది. కర్ణాటకలో విజయం అనంతరం దేశం మొత్తం గెలిచేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల రూపొందించుకుంటుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది.
ముందస్తుగా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రాయలసీమ నుంచి ప్రారంభమైన అనంతరం రూట్ మ్యాప్ ప్రకారం ఆయన యాత్ర చేపట్టిన నియోజకవర్గాల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను సైతం విమర్శించుకుంటూ వస్తున్నారు. పలుచోట్ల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం పవన్ చేపడుతున్న వారాహి యాత్రలో ఆ మేరకు నిరసనలు కానరాకపోవడం గమనించదగ్గ విషయం.