కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం యడియూరప్ప అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఉద్యోగులకు శుభవార్తలు చెప్పారు. ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళలకు సంబంధించిన వేర్వేరు కార్యక్రమాల అమలు కొరకు 37,188 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. Also Read: ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు […]
గడిచిన మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 225 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై అదనపు భారం పడుతోంది. గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను మోదీ సర్కార్ మరోసారి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. Also Read: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. రుణాలు తీసుకునే మహిళలకు […]
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు తీసుకునే మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా హోం లోన్ తీసుకునే మహిళలకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా ఇచ్చే తగ్గింపుతో పోలిస్తే మహిళలు తీసుకునే హోమ్ లోన్స్ పై మరింత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. Also Read: గ్యాస్ […]
కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటిపండ్లు ముందువరసలో ఉంటాయి. అరటిపండ్లు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. చాలామంది అరటిపండు తింటే బరువు పెరుగుతారని భావిస్తున్నా శాస్త్రవేత్తలు మాత్రం అరటిపండ్లు బరువు తగ్గడానికి కారణమవుతాయని వెల్లడిస్తున్నారు. అయితే రోజుకు రెండు అరటిపండ్లు తింటే మాత్రమే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అరటిపండ్లను […]
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరేవాళ్లకు తీపికబురు అందించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఇప్పటివరకు ఏడు విడతల నగదు రైతుల ఖాతాల్లో జమైంది. మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో ఎనిమిదో విడత నగదు జమ కానుందని తెలుస్తోంది. అయితే అర్హత ఉండి కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరే రైతుల […]
ఈ ప్రపంచంలో ఎంతోమంది వింత వ్యక్తులు ఉంటారు. కొందరు వాళ్ల ప్రవర్తన వల్ల వింత వ్యక్తులు అని అనిపించుకుంటే మరి కొంతమంది మాత్రం ఆహారపు అలవాట్ల వల్ల వింత వ్యక్తులుగా పిలవబడతారు. అలా వింత ఆహారపు అలవాట్లను పాటించే వారిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రామ్‌దాస్ బోడ్కే ఒకరు. గడిచిన 32 సంవత్సరాలుగా రామ్ దాస్ బోడ్కే కేవలం రాళ్లు మాత్రమే తింటూ జీవిస్తుండటం గమనార్హం. వినడానికి ఆశ్చర్యంగా ఉనా ఆ వ్యక్తి ప్రతిరోజూ 250 గ్రాముల […]
పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. చాలామంది ఈ సమస్య పెద్ద సమస్య కాదని నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే ఈ సమస్య కొన్ని వ్యాధులను సూచిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దంతాలు, నాలుకపై బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. మౌత్ వాష్ లు ఉపయోగించడం ద్వారా కొంతమందిలో ఈ సమస్య తగ్గుతుంది. మౌత్ వాష్ లు వినియోగించినా […]
రెండు నెలల క్రితం దేశంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వల్ల వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోళ్లు చనిపోవడంతో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రజల్లో చాలామంది చికెన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా చికెన్ ధరలు భారీగా తగ్గడంతో పాటు కోళ్ల పెంపకందారులు భారీగా నష్టపోయారు. కరోనా విజృంభించిన తొలినాళ్లలో సైతం. చికెన్ తింటే కరోనా సోకుతుందని జోరుగా ప్రచారం జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల […]
ప్రస్తుత కాలంలో సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకున్నా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవేళ విషపూరిత ఆహారం తింటే మాత్రం ప్రజలు ఆస్పత్రులలో చేరాల్సి వస్తుంది. కొంతమంది వ్యాపారులు లాభం కోసం చేసే పనుల వల్ల ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి. చేపలు పెంచేవాళ్లు చేపలకు ఆరోగ్యకరమైన మేత వేసి పెంచాలి. అలా కాకుండా కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు వేసి పెంచితే మాత్రం ఆ చేపలు తిన్నవాళ్లు వ్యాధుల బారిన పడతారు. అయితే వ్యాపారులు […]
దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా పసిడి ధర మరింత తగ్గితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలకు మాత్రం ఉచితంగా బంగారం లభిస్తోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఒక బంగారు కొండ వెలుగులోకి వచ్చింది. ఆ కొండను తవ్వే కొద్దీ బంగారం వస్తుండటం గమనార్హం. కొండంతా బంగారం ఉందని తెలియడంతో గ్రామస్తులు పెద్దపెద్ద సంచుల్లో […]