సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద.. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది.
గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం రగులుతూనే ఉంది. అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఎంతలా పట్టు బిగిస్తున్నారో పరిణామాలు చూస్తుంటే తెలుస్తున్నాయి. చివరకు చట్టాలకు, రాజ్యాంగానికి ఎలా గంతలు కట్టారో కళ్ళముందే కనిపిస్తోంది.
తనను అవినీతిపరుడుగా ముద్ర వేయడంలో చంద్రబాబు పాత్ర అధికమని ఏపీ సీఎం జగన్ అనుమానిస్తున్నారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్న ప్రతి ఒక్కరి అంతు చూడడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
తెలంగాణ టెట్ అర్హత కాలపరిమితి జీవిత కాలం ఉంటుంది. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు. పేపర్ 2 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వందల సంవత్సరాల చరిత్ర. డచ్ వారు 1602 లో రాజమండ్రిలో ఒక కోటను నిర్మించారు. ఆ కోట అనతి కాలంలో జైలు గా మారిందని చరిత్ర చెబుతోంది.
గుంటూరుకు చెందిన కట్ట కృష్ణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదయినా... ఆయన్ను ఎవరు ఏమి చేయలేరు అనేది నిన్నటి మాట. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జగన్ చేసి చూపించారు.
తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ కీలక విషయాలపై స్పష్టతనిచ్చారు. రాజకీయ వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు.