ప్రస్తుత పరిస్థితుల్లో రిషబ్ పంత్ ఫిట్నెస్ నిరూపించుకోవడం కష్టమని బీసీసీఐతోపాటు సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఆటగాడిపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను బీసీసీఐ వర్గాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ పంత్ కు ఉన్న మార్గాలు మూసుకుపోయినట్లు చెబుతున్నారు
భారత జట్టు ఐదేళ్ల తరువాత తొలిసారి 99వ స్థానాన్ని దక్కించుకుంది. 2018లో 100వ స్థానాన్ని భారత జట్టు దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని భారత జట్టు మెరుగుపరుచుకుంది. ఇకపోతే భారత పురుషుల పుట్ బాల్ జట్టు కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంకు 94 కావడం గమనార్హం. ఇకపోతే ఫిఫా ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా తొలి స్థానంలో కొనసాగుతుండగా, ప్రాన్స్ రెండో స్థానంలో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడితే తప్ప ఈ టెస్టులో నిలిచే అవకాశం లేదు. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు పోరాట పట్టిన ప్రదర్శిస్తారు, ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తేలిపోతారో చూడాల్సి ఉంది. శుక్రవారం మూడో రోజు ఆట జరగనుంది.
సాంప్రదాయ సబ్ మెర్సిబుల్ కాకుండా మాత్ర ఆకారపు డిజైన్ చేశారని వివరించారు. దీనివలన ప్రమాదం సంభవించి ఉండవచ్చు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువమంది పట్టాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా డిజైన్ చేశారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా సముద్ర జలాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి గోళాకారంగా తయారు చేయాలి. కాని ఈ సబ్ మెర్సిబుల్ భిన్నంగా తయారు చేశారని శాస్త్రవేత్తలు వివరించారు.
టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ లో ఉన్న భారత జట్టుకు ఎంపికైన జైస్వాల్ కొద్దిరోజుల కిందట జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అదరగొట్టడం ద్వారా జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. గురువారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేయగా.. ఈ జాబితాలో జైస్వాల్ చోటు సంపాదించాడు.
కోహ్లీని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో భాగంగా బుధవారం పాకిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సుదర్శన్ అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 110 బంతుల్లో 104 పరుగులు చేసిన సాయి సుదర్శన్ నాటౌట్ గా నిలిచాడు.
రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ సంధించిన నిప్పులు చెరిగే బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను చూసిన ఎంతోమంది ధోని శిష్యుడా మజాకా అంటూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఈ ఆటగాడికి కలిసి వచ్చిందంటూ పలువురు పేర్కొంటున్నారు.
టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విడదీసి మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఏ గ్రూపులో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా బి గ్రూపులో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి.
ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విడగొడతారు. గ్రూప్-ఎ లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి.