గతానికి భిన్నంగా ఈ ఏడాది ఐపీఎల్ లో పలువురు వెటరన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. లేటు వయసులో ఘాటైన ప్రదర్శనతో యువకులకు పోటీగా నిలుస్తున్నారు. తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్లకు గొప్ప విజయాలను అందించి పెడుతున్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది ప్లేయర్లే ఉండడం గమనార్హం.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.20 లక్షలు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వారికి రూ.12 లక్షలు ప్రైజ్ మనీ గా ఇవ్వనన్నారు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ఆటగాడికి రూ.15 లక్షలు గేమ్ చాలెంజర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.12 లక్షలు దక్కించుకుంటారు.
చెన్నై జట్టుకు ప్రధానమైన బలం ఓపెనర్లే. ఈ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ భాగస్వామ్యమే చెన్నైకి కలిసి వస్తోంది. చెన్నై జట్టు సాధించిన విజయాల్లో ఈ ఇద్దరు కీలకంగా నిలుస్తున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ఉన్నారు. ఐపీఎల్ లో ఎక్కువ మంది స్పాన్సర్లు కలిగిన చెట్టు కూడా ఇదే కావడం గమనార్హం. ది ట్రిబ్యూన్ ప్రకారం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూషన్ రూ.10,070 కోట్లకుపైమాటే. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు రూ.200 కోట్లు మేర పెరిగింది. ఇప్పటి వరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు ఇదే కావడం విశేషం.
ఒకే సీజన్ లో మూడు సెంచరీలు బాదిన సుబ్ మన్ గిల్.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో క్వాలిఫైయర్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై గిల్ 129 పరుగులు సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఓపెనర్లు వృధ్ధిమాన్ సాహా, సుబ్ మన్ గిల్ జట్టుకు సుభారంభాన్ని అందించారు. 6.2 ఓవర్లలోనే 54 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడే గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ చేస్తున్న అనేక కంపెనీలో మోసపూరిత సంస్థలు ఉన్నట్లు సజ్జనార్ పేర్కొంటున్నారు. మోసపూరిత సంస్థలను ఐపీఎల్ లో భాగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు ట్రోఫీ గెలిచిన ప్రతిసారి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యంత ప్రతిభ కలిగిన కెప్టెన్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని కూడా నాలుగు సార్లు మాత్రమే ట్రోఫీ గెలిచాడు.
లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు ముంబై ఇండియన్స్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ నోరు కాస్త తెరిచి గాఢ నిద్ర చేస్తున్నాడు.
ప్లే ఆఫ్ దశలో ఇరు జట్లకు భిన్నమైన ఫలితాలు ఎదురయ్యాయి. లీగ్ దశలో పది విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడిపోగా, 8 విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై అద్భుత విజయాన్ని అందుకుంది.