Pat Cummins On IPL: ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కమిన్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలని ఉందన్నాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

Pat Cummins On IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో, ముఖ్యంగా లీగ్ ల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్ రావడానికి ముందు వరకు ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యం ఉండేది. ఐపీఎల్ వచ్చిన తర్వాత అటువంటి ఆధిపత్యం చాలా వరకు తగ్గింది అనేది ఎక్కువ మంది క్రికెటర్ల భావన. తాజాగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాత్ కమిన్స్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఈ ఆటలో అనేక మార్పులను తీసుకువచ్చిందని వివరించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత ఆటగాళ్లకు ఆర్థికంగా ఎంతో మేలు కలిగింది. అప్పటి వరకు తీసుకొని విధంగా కోట్లాది రూపాయల పారితోషకాలను తీసుకొని ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఎంతోమంది ఆటగాళ్లకు ఐపిఎల్ ఆర్థిక భరోసా కల్పించింది. కోట్లాది రూపాయల ఆదాయం రావడంతో చాలామంది ఆటగాళ్లు జీవితాలు మారిపోయాయి. ఆటగాళ్ల ఆర్థిక స్థితిగతుల్లోనే కాకుండా క్రికెట్లోనూ అనేక మార్పులకు ఐపీఎల్ కారణమైందని, ముఖ్యంగా ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ ఆధిపత్యం ఐపీఎల్ తర్వాత చాలా వరకు తగ్గిందని ఎక్కువ మందిలో అభిప్రాయం ఉంది. ఈ విధమైన అభిప్రాయాన్ని తాజాగా కమిన్స్ వ్యక్తం చేశాడు.
క్రికెట్ లో అనేక మార్పులను తీసుకువచ్చిన ఐపీఎల్..
ఈ నెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆస్ట్రేలియా – భారత జట్లు డబ్లూటిసి ఫైనల్ లో ఇంగ్లాండ్ వేదికగా తరపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా జట్టు సారథి కమిన్స్ ఐపీఎల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. క్రికెట్లో ఐపీఎల్ అనేక మార్పులకు కారణమైందని, పరిస్థితులకు అనుగుణంగా క్రికెట్ లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఐపీఎల్ తీసుకువచ్చిందని వెల్లడించాడు.
ఆటగాళ్ల సమయంపై గుత్తాధిపత్యానికి ముగింపు..
ఐపీఎల్ రావడానికి ముందు ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్
గుత్తాధిపత్యం ఉండేది. ఐపీఎల్ వచ్చిన తర్వాత దీనికి ముగింపు పలికినట్టు అయిందని కమిన్స్ వెల్లడించాడు. ప్రాంచైజీ క్రికెట్ కంటే.. జాతీయ జట్టు కోసం ప్రాధాన్యత ఇచ్చేలా ఆటగాళ్ళను ఒప్పించడం సవాల్ గా మారనుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. లాభదాయక టి20 లీగ్ లు కారణంగానే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు కూడా ట్రెంట్ బౌల్ట్ వద్దన్నాడు అన్న విషయాన్ని కమిన్స్ అంగీకరించాడు. దశాబ్ధం క్రితమే ఐపీఎల్ క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిందని వివరించాడు. ఇదే పరిస్థితి అనేక మంది ఆటగాళ్లలో ఉందని, దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి వెనక్కి తగ్గుతుందని వివరించాడు. ‘గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్ కు గుత్తాధిపత్యం లేదు. దశాబ్దం క్రితమే ఐపీఎల్ దీనిని మార్చి వేసింది. దీని గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక నా జట్టు సహచరులు ఇతర విషయాల కంటే జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. అయితే, ఎక్కువ లాభదాయకత ఉండే ప్రాంచైజీ లీగ్ లు కారణంగా ఇది సవాల్ తో కూడుకున్న అంశం’ అని కమిన్స్ పేర్కొన్నాడు.
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి..
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కమిన్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలని ఉందన్నాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇక క్రికెట్ సాకర్ మార్గంలో వెళ్తూ ఉందని, జాతీయ జట్టుకు ఆడేందుకు
ప్రాంచైజీల నుంచి అనుమతులు అవసరమయ్యే పరిస్థితులు వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కమిన్స్ పేర్కొన్నాడు. గత ఎడిషన్ లో ఫైనల్ వరకు వెళ్లిన ఇండియాతో తాము తలపడుతుండడంతో మరింత ఆసక్తిగా చూస్తున్నట్లు వివరించాడు.
