Atal Pension Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెన్షన్ ను పొందడానికి అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ స్కీమ్ లో సబ్ స్క్రైబర్ల సంఖ్య 4 కోట్ల కంటే ఎక్కువగా ఉందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ వెల్లడించింది.

Atal Pension Yojana
2015 సంవత్సరం మే నెలలో మోదీ ఈ స్కీమ్ ను అమలులోకి తెచ్చారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ కోసం నెలకు 42 రూపాయల నుంచి 210 రూపాయల వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంది.
Also Read: Ravi Teja Son First Film: రవితేజ కొడుకు మొదటి సినిమా డైరెక్టర్ ఫిక్స్
వయస్సు, పొందే పెన్షన్ మొత్తం ఆధారంగా ఇందులో మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇతర చట్టబద్ధమైన సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లో సభ్యులు కాని వాళ్లు, ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు, కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. https://enps.nsdl.com/enps/nationalpensionsystem.html లింక్ ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.
అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లు ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.
Also Read: S S Rajamouli: రాజమౌళి చెప్పిన ఆ మార్పులు చెయ్యడం వల్లే రాధే శ్యామ్ అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందా??
Recommended Videos: