Gujarat Assembly Elections: మరో కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి . ఈసారి త్రిముఖ పోరు తప్పదని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎన్నికలంటే డబ్బే ముఖ్యం కనుక గుజరాత్ లోనూ డబ్బు ప్రవాహం అధికంగా ఉంది. దీనికి తోడు ఎన్నికల సమయంలో పార్టీలకు ఆయా సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. ఇందుకు గానూ ఎలక్ట్రోలర్ బాండ్లను పార్టీలు వారికి ఇస్తూ ఉంటాయి. అయితే ఈసారి గుజరాత్ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలు వివాదాస్పదమయ్యాయి. వచ్చిన విరాళాలలో సింహభాగం భారతీయ జనతా పార్టీకి దక్కడం ఇందుకు కారణం.

Gujarat Assembly Elections
-ఇలా వెలుగులోకి వచ్చింది
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ పొలిటికల్ రి ఫార్మ్స్ అనే సంస్థ ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా లోతుగా వెళ్లి పరిశీలన చేసింది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గత ఐదు సంవత్సరాలల్లో 94% విరాళాలు సేకరించింది.. మిగతా 6% ఇతర పార్టీలకు వచ్చాయి . ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 2018 నుంచి 2022 దాకా మొత్తం విరాళాలు 174 కోట్ల దాకా వచ్చాయి.. అయితే ఇందులో 163 కోట్లు బిజెపికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 10.5 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 32 లక్షలు, ఇతర పార్టీలో 10 లక్షలు విరాళాల రూపంలో పొందాయి. మొత్తం 1571 మంది విరాళాలు ఇవ్వగా.. అందులో 1519 మంది బిజెపి వైపు మొగ్గు చూపారు. ఇక దేశంలోనూ 2107_18 కి సంబంధించి ఎలక్ట్రోలర్ బాండ్ల ద్వారా బీజేపీ 63 శాతం విరాళాల రూపంలో బిజెపి స్వీకరించింది..
-343 కోట్లకు కొన్నారు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ పొలిటికల్ రి ఫార్మ్స్ అనే సంస్థ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సమాచార హక్కు చట్టం ద్వారా పలు వివరాలు సేకరించింది. ఈ బ్యాంకులో 595 బాండ్లను 343 కోట్లకు కొంతమంది కొనుగోలు చేశారు.ఇక ఏప్రిల్ 2019లో 137 బాండ్లను 87.5 కోట్లకు కొందరు కొనుగోలు చేశారు. ఈ లెక్కన వీటిల్లో సింహభాగం నిధులు బాండ్ల ద్వారా బిజెపిలోకి ప్రవహించాయి. ఇక వచ్చిన విరాళాలలో అత్యధికంగా కార్పొరేట్ సంస్థలే ఇచ్చాయి. మొత్తం 4,014.58 కోట్ల దాకా అవి విరాళాలు ఇచ్చాయి.. ఇక ఇందులో నాలుగు శాతం అంటే 174 కోట్లు ఒక్క గుజరాత్ నుంచి మాత్రమే వచ్చాయి.. ప్రూడెంట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ నుంచి 74.3 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆరు కంపెనీలు ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చాయి.

Gujarat Assembly Elections
-ఎన్నికల్లో ధన ప్రవాహం
ఇలా బాండ్ల విక్రయం ద్వారా సంస్థలు భారీగా విరాళాలు ఇస్తున్నాయి. దీనివల్ల ఎన్నికల్లో అధికార పార్టీకి బలం చేకూరుతోంది. ఎన్నికల్లో అనుహ్యంగా ధన ప్రవాహం పెరుగుతున్నది. అది అతిమంగా ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. మొన్న జరిగిన మునుగోడు ఎన్నికల్లో ఇదే నిరూపితమైంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇదే జరగబోతోంది.. బాండ్ల ద్వారా విరాళాల సేకరణ అనేది పైకి పారదర్శకంగానే కనిపిస్తున్నా… లోపల మాత్రం బొచ్చెడు లొసుగులు.