Bigg Boss 7 Telugu: చివరి నిమిషంలో వీళ్లకు బిగ్ బాస్ ఛాన్స్ చేజారింది! కారణం ఏంటంటే?
అయితే ఇది చాలా తక్కువ సంఖ్య. గతంలో అత్యధికంగా 21 మంది అత్యల్పంగా 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. లాంచింగ్ ఎపిసోడ్ లో కేవలం 14 మందిని ఇంట్లోకి ప్రవేశ పెట్టడం ఆసక్తి రేపుతోంది.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 అట్టహాసంగా సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో లేటెస్ట్ సీజన్ అద్బుతంగా మొదలైంది. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి వంటి యంగ్ హీరోలు అతిథులుగా హాజరయ్యారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. ప్రియాంక సింగ్, శివాజీ, దామిని, ప్రిన్స్ యావర్,శుభశ్రీ రాయగురు, నటి షకీలా, ఆట సందీప్, కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతిక, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, నటుడు అమర్దీప్ చౌదరి హౌస్లోకి ప్రవేశించారు.
అయితే ఇది చాలా తక్కువ సంఖ్య. గతంలో అత్యధికంగా 21 మంది అత్యల్పంగా 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. లాంచింగ్ ఎపిసోడ్ లో కేవలం 14 మందిని ఇంట్లోకి ప్రవేశ పెట్టడం ఆసక్తి రేపుతోంది. చివరి నిమిషంలో కొందరు షో నుండి తప్పుకోవడం కూడా కారణం కావచ్చు. పూజా మూర్తి, జబర్దస్త్ నరేష్, మొగలిరేకులు సాగర్, యూట్యూబర్ అనిల్ గిల్లా కూడా లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.
పూజా మూర్తి తండ్రి హఠాన్మరణం పొందాడు. దీంతో ఆమె చివరి నిమిషంలో షో నుండి తప్పుకుంది. ఇక జబర్దస్త్ నరేష్ కూడా రావాల్సింది. జబర్దస్త్ షో అగ్రిమెంట్ బ్రేక్ చేయడం ఇష్టం లేక నరేష్ బిగ్ బాస్ వదులుకున్నాడట. ఒకసారి జబర్దస్త్ నుండి తప్పుకొని వేరే షోకి వెళితే మల్లెమాల సంస్థ రానీయదు. అలాగే అగ్రిమెంట్ బ్రేక్ చేసి మధ్యలో వెళ్ళిపోతే లక్షల్లో డబ్బులు చెల్లించాలి. అందుకే నరేష్ సాహసం చేయలేదు.
మాజీ జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఆచంటకు కూడా ఆఫర్ వచ్చిందట. ఆయన కొన్ని కారణాలతో తప్పుకున్నారట. ఇక మొగలి రేకులు సాగర్ కూడా బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొనాల్సి ఉందట. ముఖ్యంగా ఈ నలుగురు చివరి నిమిషంలో వివిధ కారణాలతో షో నుండి తప్పుకున్నారని సమాచారం. ఒకవేళ ఆ నలుగురు కూడా వస్తే 18 మంది కంటెస్టెంట్స్ అయ్యేవారు.
