Asian Games 2023: జైత్రయాత్ర.. మన అమ్మాయిల జైతయాత్ర.. ఏషియన్ గేమ్స్ లోనూ ‘గోల్డ్’ కొట్టారు..

మన ప్లేయర్లు అందరు కూడా ఎక్కడ కూడా అసలు భయం అనేది లేకుండా చాలా దైర్యం గా మ్యాచ్ ఆడి గెలవడం చూసిన యావత్తు ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరు కూడా చాలా గర్వ పడుతున్నారు…

  • Written By: Gopi
  • Published On:
Asian Games 2023: జైత్రయాత్ర.. మన అమ్మాయిల జైతయాత్ర.. ఏషియన్ గేమ్స్ లోనూ ‘గోల్డ్’ కొట్టారు..

Asian Games 2023: ప్రస్తుతం టీం ఇండియా సూపర్ ఫామ్ లో ఉంది.రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద సిరీస్ ని సైతం కైవసం చేసుకుంది. ఇక మెన్స్ క్రికెట్ విజయ యాత్ర ఇలా ఉంటే, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కూడా చాలా రకాలైన రికార్డులను నెలకొల్పుతుంది.ఇప్పటీకే ఆసియా కప్ లో లాస్ట్ ఇయర్ శ్రీలంక మీద ఫైనల్ మ్యాచ్ గెలిచి ఇండియన్ టీం ని ఏడోవసారి ఏషియా కప్ ఫైనల్ లో విశ్వ విజేతలు గా నిలిపారు. ఇక ఇప్పుడు చైనా లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఏషియన్ గేమ్స్ లో కూడా ఇండియన్ మహిళా క్రికెట్ టీం మొదటి సారి ఏషియన్ గేమ్స్ లో పాల్గొనడం జరిగింది.అయినప్పటికీ ఎక్కడ తడబడకుండా ఇవాళ్ల శ్రీలంక మహిళా జట్టు మీద ఫైనల్ మ్యాచ్ ఆడింది.మన ప్లేయర్లు అందరు కూడా ఎక్కడ కూడా అసలు భయం అనేది లేకుండా చాలా దైర్యం గా మ్యాచ్ ఆడి గెలవడం చూసిన యావత్తు ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరు కూడా చాలా గర్వ పడుతున్నారు…

ఈమ్యాచ్ లోఇండియా శ్రీలంక మీద 19 పరుగుల తేడా తో ఒక మంచి విజయాన్ని అందుకుంది.ఇక దీంతో ఇండియన్ మహిళా క్రికెట్ టీం ఏషియా కప్ లో మొదటి సారి అడుగు పెట్టిన కూడా ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక టీం ని చిత్తు చేయడం చూసిన ఇండియన్ అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు.ఇక దీంతో ఇండియా గోల్డ్ మెడల్ అందుకుంది…ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లకి 7 వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది.ఇక ఈ టీం లో స్మృతి మందాన 46 పరుగులు చేసింది.అలాగే రోడ్రిగస్ 42 పరుగులు చేసింది. వీళ్ళిద్దరిని మినహా ఇస్తే మిగిలిన ఎవ్వరు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

ఇక 117 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన శ్రీలంక టీం నిర్ణీత 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది.ఇక మన బౌలర్లలో టైటస్ సాదు 3 వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీసి శ్రీలంక ప్లేయర్లను భారీ దెబ్బ తీశారు. దీంతో ఇండియా 19 పరుగుల తేడా తోమంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక ఇండియా బంగారు పథకాన్ని సాధించడం పట్ల పలువురు సీనియర్ క్రికెటర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మన మెన్స్ టీం కూడా ఏషియన్ గేమ్స్ లో ఆడబోతుంది దీనికి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక ఇండియన్ మహిళా టీం ఏషియన్ గేమ్స్ లో తలపడి వాళ్ల సత్తా ఏంటో చూపించి విజేతలుగా నిరూపించుకున్నారు. ఇక మెన్స్ టీం కూడా మొదటి సారి ఏషియన్ గేమ్స్ ఆడుతున్న సందర్భంలో వాళ్ళు కూడా గెలిచి ఇండియన్ క్రికెట్ టీం పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుందాం…ఇక అలాగే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం రోజు రోజు కి కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు