Asia Cup 2023: భారత్ తో పెట్టుకుని .. ఆసియా కప్ చేజార్చుకొని.. పాకిస్తాన్ స్వయంకృతాపరాధం
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. టోర్నీ పాకిస్తాన్ లో జరిగిన.. భారత్ తన మ్యాచ్ లను యూఏఈ లో ఆడాలని ఆ దేశం చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో

Asia Cup 2023: ఆసియా కప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన పాకిస్తాన్ కు షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ లోనే నిర్వహిస్తామని, భారత్ ఆడినా, ఆడకున్నా.. ఆతిథ్యం మారదు పాకిస్తాన్ భీరాలు పలికింది. అయితే, పాక్ లో ఆడేందుకు ముందు నుంచి ఆసక్తి చూపించని భారత్.. వెనుక మంత్రాంగం నదిపింది. ఫలితంగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఆతిథ్యం ఆ దేశం నుంచి చేజారింది. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి ఆరంభం కావాల్సిన ఈ టోర్నీని పాకిస్తాన్ నుంచి మరో చోటకు తరలించాలని సోమవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ నిర్వహించాలని భావించిన పాకిస్తాన్ కు దీంతో షాక్ తగిలినట్టు అయిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. టోర్నీ పాకిస్తాన్ లో జరిగిన.. భారత్ తన మ్యాచ్ లను యూఏఈ లో ఆడాలని ఆ దేశం చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో.. ఎసిసి ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ, సర్వసభ్య సమావేశంలో చర్చించి చైర్మన్ జైషా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. టోర్నీని శ్రీలంకలో నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆశతో ఎదురుచూస్తున్న పాకిస్తాన్..
అయితే, మంగళవారం జరిగే రెండవ దఫా చర్చల్లో ఏసీసీ తన మనసు మార్చుకుంటుందేమోనని పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ ఆశతో ఎదురుచూస్తోంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పార్కు తమ జట్టును పంపించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు తమ జట్టును పంపించి చిక్కుల్లో పడలేమని పేర్కొంది. ఆ తరవాత ఎన్నో చర్చలు జరిగినా రకరకాల ప్రతిపాదనలు చేసినా సమస్య తేలలేదు. ‘పాకిస్తాన్ చేసిన తటస్థ దేశంలో భారత్ మ్యాచ్ ల ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ భారత్, పాక్ ఒకే గ్రూపులో ఉంటే మూడో జట్టు రెండు దేశాల మధ్య తిరుగుతూ మ్యాచ్ లు ఆడాలి’ అని ఏసిసి వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో..
ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతల నుంచి పాకిస్తాన్ ను దూరం చేసిన నేపథ్యంలో.. పాకిస్తాన్ జట్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పాకిస్తాన్ లో టోర్నమెంట్ నిర్వహించకపోతే తాము ఆడేది లేదంటూ గతంలో పాకిస్తాన్ పేర్కొంది. అదే నిర్ణయం పై పాకిస్తాన్ ఉంటుందా..? లేక మనసు మార్చుకుని టోర్నమెంట్ లో ఆడుతుందా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ బయట నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
