India vs Pakistan : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : గెలుపు ఎవరిది? ప్రివ్యూ

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమ్ కి ఎక్కువ గా గెలిచే అవకాశాలు ఉంటాయనే విషయం అయితే అల్చల స్పష్టంగా తెలుస్తోంది…

  • Written By: NARESH
  • Published On:
India vs Pakistan : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : గెలుపు ఎవరిది? ప్రివ్యూ

India vs Pakistan : ఏషియా కప్ సూపర్ 4 లో భాగంగా ఈరోజు ఇండియా పాకిస్థాన్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగనుంది…దీనికి రికార్డ్ స్థాయి లో వ్యూయర్ షిప్ దక్కనున్నట్లు గా తెలుస్తుంది.ఇక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఏసీసీ కూడా ఈ మ్యాచ్ కోసం భారీ ప్లాన్ వేసి ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉండేలా చూసుకుంది…ఇక ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి కాబోతుంది, గ్రౌండ్ రిపోర్ట్ లు ఎలా ఉన్నాయి ఈ పిచ్ లో ఇంతకు ముందు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది లాంటి విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఈ మ్యాచ్ కోసం ఇండియా పాకిస్థాన్ దేశాల జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులు అయిన ఈ రెండు టీములు మ్యాచ్ ఆడితే చూడటానికి ప్రతి దేశం అసక్తి గా ఎదురుచూస్తుంది…ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమ్ కి ఎక్కువ గా గెలిచే అవకాశాలు ఉంటాయనే విషయం అయితే  స్పష్టం గా తెలుస్తోంది…

ఒకసారి ఈ గ్రౌండ్ స్టాట్స్ ని కనక చూసుకుంటే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో మొత్తం 131 మ్యాచు ఆడితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీములు 176 మ్యాచు లు గెలిచాయి.ఇక చేజింగ్ లో బ్యాటింగ్ చేసిన టీములు కేవలం 55 మ్యాచ్ లు మాత్రమే గెలిచాయి.ఇక ఈ పిచ్ లో అవరెజ్ స్కోర్ వచ్చేసి 240 గా ఉంది…మొదట బ్యాటింగ్ చేసిన టీములు ఇక్కడ 300 ప్లస్ స్కోర్ చేయడం కష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఈ పిచ్ స్టార్టింగ్ నుంచే చాలా స్లో గా ఉంటుంది…ఈ పిచ్ లో ఆడిన చివరి 10 మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే 300 పైన స్కోర్ సాధించడం జరిగింది…ఇక పిచ్ లో జరిగిన మొత్తం 131 మ్యాచ్ ల్లో 21 సార్లు 300 ప్లస్ స్కోర్ చేయడం జరిగింది…

ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ కి పిచ్ కొంచం బ్యాటింగ్ చేయడానికి అనుకూలిస్తుంది. అలాగే రిజర్వ్ డే ఉంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడితే నెక్స్ట్ డే మ్యాచ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ డే బౌలింగ్ చేయవచ్చు అలాగే అప్పుడు ఈ పిచ్ ఇంకా బాగా బౌలింగ్ కి అనుకూలిస్తుంది అనే చెప్పాలి…ఇక ముఖ్యంగా ఇది స్పిన్నర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడం వల్ల ఇక్కడ స్ప్పినర్లదే హవా నడుస్తుందనే చెప్పాలి…ఇక ఇప్పటి వరకు ఈ పిచ్ లో ఇండియా పాకిస్థాన్ రెండు జట్లు కూడా రెండు సార్లు తలపడితే అందులో పాకిస్థాన్ ఒక మ్యాచ్ గెలవగా ఇంకో మ్యాచ్ పలితం తేలలేదు అయితే ఇప్పటి వరకు ఈ పిచ్ మీద మన టీమ్ పాకిస్థాన్ ని ఒక్కసారి కూడా ఓడించలేదు అనే చెప్పాలి…

ఇక ఈ గ్రౌండ్ లో ఇండియా మొత్తం 48 మ్యాచులు ఆడితే అందులో 23 మ్యచ్ లు విజయం సాధించింది 19 మ్యాచ్ ల్లో ఓడిపోయింది పలితం తేలని మ్యాచ్ లు 6 ఉన్నాయి…

ఇక పాకిస్థాన్ ఈ పిచ్ మీద ఇప్పటి వరకు 26 మ్యాచ్ లు ఆడితే అందులో 14 మ్యాచు గెలిచింది 8 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాగే పలితం తేలని మ్యాచ్ లు 4 ఉన్నాయి…

ఇక ఈ స్టాట్స్ ని బట్టి చూస్తే ఈ పిచ్ లో వాళ్ళకే మంచి రికార్డ్ ఉంది.ఇక పాకిస్థాన్ ఆడిన చివరి 20 మ్యాచ్ ల్లో 16 గెలిచింది 3 ఓడిపోయింది ఒకటి పలితం తేలని మ్యాచ్ గా మిగిలింది…

ఇక ఇండియా విషయానికి వస్తె చివరి 21 మ్యాచ్ ల్లో 11 మాత్రమే గెలిచింది 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.మూడు మ్యాచ్ ల్లో పలితం రాలేదు…

ఇక రీసెంట్ గా రెండు జట్లు ఉన్న ఫామ్ ని బట్టి వాళ్ల స్టాట్స్ ని బట్టి చూస్తే మన టీమ్ కంటే పాకిస్థాన్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది…అయిన కూడా మన టీమ్ అంత వీక్ గా ఏం లేదు మనవాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరి మీద ఎలా ఆడిన కూడా పాకిస్థాన్ టీమ్ విషయానికి వస్తె డు ఆర్ డై అన్నట్టు గా మ్యాచ్ ఆడి దాన్ని ఎలాగైనా గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తారు…కాబట్టి పాకిస్థాన్ మీద ఆడటానికి ఇండియన్ ప్లేయర్ అయితే చాలు ప్రత్యేకంగా ఫామ్ అవసరం లేదు అని మరి కొందరు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు..ఎందుకంటే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్ లోనే ఫామ్ లోకి వస్తాడు కాబట్టి…

ఇక ఈ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం చాలా ఎక్కువ గా ఉంది కాబట్టి మన టీమ్ టాస్ గెలవాలని కోరుకుందాం…ఇక పాకిస్థాన్ టీమ్ లాస్ట్ మ్యాచ్ లో స్పిన్నర్ అయిన మహమ్మద్ నవాజ్ ని పక్కన పెట్టీ అతని ప్లేస్ లో ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్ రౌండర్ అయిన ఫాహిం అశ్రఫ్ ని టీమ్ లోకి తీసుకున్నారు కానీ ఇండియా మీద మ్యాచ్ లో మళ్ళీ మహమ్మద్ నవాజ్ ని ప్లేయింగ్ లేవన్ లోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి…

ఎందుకంటే నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఆయన్ని టీమ్ లోకి తీసుకువస్తారు అలాగే ఈ పిచ్ కూడా స్పిన్ కి అనుకూలిస్తుంది అనేది కూడా ఒక రీజన్ ఇక వీటి కంటే ఇంకో పెద్ద విషయం ఏంటంటే మన ప్లేయింగ్ లేవన్ లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ ఉండటం వల్ల ఆయన్ని తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది…

ఇక ఇండియా టీమ్ లో బుమ్రా కే ఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు అయితే బుమ్రా టీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది కానీ రాహుల్ మాత్రం ఈ మ్యాచ్ లో బెంచ్ కే పరిమితం కానున్నట్లు గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పాకిస్థాన్ మీద మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టీ రాహుల్ ని తీసుకొని సహాసం చేయలేరు కాబట్టి ఈ ఒక్క మ్యాచ్ కి మాత్రం ఇషాన్ కిషన్ అందు బాటు లో ఉంటాడు…ఇక బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ ని తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే అక్షర్ పటేల్ శార్దూల్ టాకుర్ కంటే బెస్ట్ అల్ రౌండర్ అనేది ఒకటి అయితే పాకిస్థాన్ ప్లేయింగ్ లేవన్ లో వాళ్ల ఓపెనర్లని మినహాయిస్తే మిగితా అందరి కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారు.ఒక్క నెంబర్ ఎయిట్ లో బ్యాటింగ్ కి వచ్చే మహమ్మద్ నవాజ్ మినహా ఆల్మోస్ట్ రైట్ హాండర్స్ ఉండటం తో అక్షర్ పటేల్ అయితే కొంచం వాళ్ల మీద ఒత్తిడి తీసుకురావచ్చు అందుకే ఆయనను తీసుకునే అవకాశం అయితే ఉంది… ఇక బుమ్రా అందుబాటులో ఉన్నాడు కాబట్టి సిరజ్ ప్లేస్ లోకి షమీ వస్తాడా లేక సిరజ్ నే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి…ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది మనం ఖచ్చితం గా చెప్పలేము కానీ ఇండియా గెలవాలని కోరుకుందాం…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు