Ashish Vidyarthi : నరేష్, పవిత్రతో పోలిస్తే ఆశీష్ విద్యార్థి ప్రేమ కథ పూర్తి డిఫరెంట్..22 ఏళ్ల చరిత్ర
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆశీష్ విద్యార్థి కూడా అదే తరహా వ్యక్తి. పైగా సినిమా ఆర్టిస్ట్. నిన్న అతడు వివాహం చేసుకున్న దగ్గర నుంచి రకరకాలుగా చర్చ జరుగుతోంది. అతడి ప్రేమ కథ గురించి అందరూ నానా విధాలుగా మాట్లాడుతున్నారు.

Ashish Vidyarthi : ఇవేమీ దేవదాసు, పార్వతి ప్రేమ కథల రోజులు కావు. ప్రేయసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోగానే ప్రియుడు తాగి ఆరోగ్యం ఖరాబు చేసుకోవడానికి. ఇష్టపడితే ప్రేమ, నచ్చితే పెళ్లి, అభిప్రాయ భేదాలు ఏర్పడితే విడాకులు.. అంతే అంతకుమించి ఏమీ లేదు. నిన్నా మొన్నటి వరకు ఇదే ధోరణి సెలబ్రిటీల్లో ఉండేది. అది ఇప్పుడు సామాన్యుల్లో కూడా విస్తరించింది. అంటే మనిషి ఏ బంధం లోనూ ఇమిడిపోవాలి అని అనుకోవడం లేదు. స్వేచ్ఛావిహంగం లాగా విహరించాలి అనుకుంటున్నాడు. ఇక నిన్న వివాహం చేసుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆశీష్ విద్యార్థి కూడా అదే తరహా వ్యక్తి. పైగా సినిమా ఆర్టిస్ట్. నిన్న అతడు వివాహం చేసుకున్న దగ్గర నుంచి రకరకాలుగా చర్చ జరుగుతోంది. అతడి ప్రేమ కథ గురించి అందరూ నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ఆశీష్ విద్యార్థికి 60 సంవత్సరాలని, అతడు పెళ్లి చేసుకున్న రూపాలి బారువాకు 33 సంవత్సరాలని మీడియా కోడయి కూసింది. కానీ ఇక్కడే అసలు విషయం తెలుసుకోకుండా సంచలనం పేరుతో రకరకాల వక్రీకరణలకు దిగింది.
కేరళ నేపథ్యం
ఆశిష్.. కేరళ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆమె తల్లి ఒక కథక్ డాన్సర్. ఢిల్లీలో పుట్టి పెరిగాడు. మొదటినుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ కావడంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు. రూపాలి బారువా వయస్సు మీడియా చెబుతున్నట్టు 33 సంవత్సరాలు కాదు. ఆమెకు 50 సంవత్సరాలు దాకా ఉంటాయి. వయసులో ఇద్దరి మధ్య పది సంవత్సరాలు తేడా. అస్సాం కు చెందిన రూపాలి ఒక ఎంటర్ ప్రెన్యూర్. “నా మెగ్” పేరిట కోల్కతాలో హ్యాండ్లూమ్ ఫ్యాషన్ స్టోర్ నిర్వహిస్తోంది. అయితే ఆమె ఆశీష్ లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఆమె ఫాలోవర్స్ కూడా జస్ట్ వెయ్యిలోపు ఉంటారు. రూపాలి కూడా మంచి డాన్సర్. అయితే తమ పెళ్లి గురించి ఆశిష్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదటి భార్య గురించి ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడలేదు. ఆమె కూడా అంతే సంస్కారవంతంగా వ్యవహరించింది.
ఆసక్తికరమైన స్టోరీ
ఆశిష్ మొదటి భార్య రాజోషి బారువా అతని పెళ్లి గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. ఆమె కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక నటి, సింగర్, థియేటర్ ఆర్టిస్ట్. గతంలో రేడియో జాకీ గా కూడా పనిచేసేది. ఈమె తల్లి శకుంతల బారువా అప్పట్లో ఒక పాపులర్ నటి. ఆశిష్ తో సంబంధాలు తెగిపోయినప్పటికీ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో విద్యార్థి అనే ఆయన సర్ నేమ్ కంటిన్యూ చేస్తోంది రాజోషి. పైగా అతనిపై ఎటువంటి ఫిర్యాదులు కూడా చేయలేదు. ఆశిష్, రాజోషి దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు అర్త్. అతడు అస్టిన్ లోని టెస్లా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆశిష్, రాజోషి దంపతులు గత అక్టోబర్ లో పరస్పర అంగీకార విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు కూడా విడాకులు మంజూరు చేసింది. 22 సంవత్సరాల వైవాహిక బంధానికి శుభం కార్డు వేసింది. అప్పటినుంచి వారిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. మీద ఒకరు ఎటువంటి కంప్లైంట్స్ చేసుకోలేదు. అంతేకాదు తనతో ఉన్న కాలం నాకు అత్యుత్తమమైనది అని రాజోశి చెబుతోంది అంటే వారిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.
తన పాత్రను నిర్వర్తించాడు
తన కొడుకుని పెంచడంలో ఆశిష్ తన పాత్రను నిర్వర్తించాడు. ఒక గైడ్ గా, ఫ్రెండ్ గా వ్యవహరించాడు. అర్త్ కూడా చాలా పరిణతి చూపాడు. తల్లిదండ్రుల మధ్య జరిగేవి సరిగా అర్థం చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఇద్దరి మధ్య సన్నని విభజన రేఖను అతడు అంగీకరించాడు. ఆ విభజన రేఖ క్రమేపీ బలపడి విడాకులకు దారితీసింది. అయినప్పటికీ దానిని అతడు ఒప్పుకున్నాడు. ఇద్దరికీ బతికే హక్కు ఉంది కాబట్టి, పరస్పరం విడిపోయినప్పటికీ కూడా వారి నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకానీ వారిద్దరి మధ్య కొట్లాటలకు అతడు కారణం కాలేదు. పైగా తల్లిదండ్రులు సంవత్సరాలుగా వేరువేరు మార్గాల్లో పయనిస్తున్నప్పటికీ అతడు పూర్తిగా సమ్మతించాడు.
స్నేహితులుగా ఉన్నారు
ఇద్దరు విడిపోయేందుకు కారణాలు చెప్పలేదు కానీ.. విడిపోయిన తర్వాత ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అంతే కాదు ఆశిష్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం పట్ల అతని మొదటి భార్య పూర్తి సమ్మతం తెలిపింది. అంతేకాదు అతడికి ఒక స్త్రీ అవసరం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, నాకు పెళ్లి అక్కర్లేదు కాబట్టి ఇలాగే ఉంటాను అని చెబుతోంది. అంతేకాదు ఇన్నాళ్లు శకుంతల బిడ్డగా, ఆశిష్ భార్యగా ఉన్న నేను సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను అని రాజోషి చెబుతోంది. కొన్ని ప్రేమ కథలు ఎందుకు మొదలవుతాయో తెలియదు, ఎందుకు ముగిసిపోతాయో కూడా తెలియదు.. ఆశీష్, రాజోషి ప్రేమ కథ కూడా అలాంటిదే. 22 సంవత్సరాల తర్వాత ముగిసిపోయింది!