మధ్యప్రదేశ్ లో బీజేపీకి భంగపాటు తప్పదా!

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలలో నెలకొన్న ముఠా తగాదాలను ఆసరా చేసుకొని మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్న బిజెపికి భంగపాటు తప్పదా? అవుననే అనిపిస్తున్నది. పది మందికి పైగా కాంగ్రెస్, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇతర ఎమ్యెల్యేలను హర్యానా, కర్ణాటకలలో రిసార్ట్ లకు తరలించి, గతంలో కర్ణాటకలో చేసిన్నట్లు `ఆకర్ష్ కమల్’ ప్రయత్నం చేయగా, ఫలించలేదని తెలుస్తున్నది. బిజెపి వలలోకే వెళ్లిన ఎమ్యెల్యేలలో చాలామంది తిరిగి వచ్చేసారని, ఇంకా ఇద్దరు […]

  • Written By: Neelambaram
  • Published On:
మధ్యప్రదేశ్ లో బీజేపీకి భంగపాటు తప్పదా!

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలలో నెలకొన్న ముఠా తగాదాలను ఆసరా చేసుకొని మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్న బిజెపికి భంగపాటు తప్పదా? అవుననే అనిపిస్తున్నది. పది మందికి పైగా కాంగ్రెస్, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇతర ఎమ్యెల్యేలను హర్యానా, కర్ణాటకలలో రిసార్ట్ లకు తరలించి, గతంలో కర్ణాటకలో చేసిన్నట్లు `ఆకర్ష్ కమల్’ ప్రయత్నం చేయగా, ఫలించలేదని తెలుస్తున్నది.

బిజెపి వలలోకే వెళ్లిన ఎమ్యెల్యేలలో చాలామంది తిరిగి వచ్చేసారని, ఇంకా ఇద్దరు మాత్రమే కర్ణాటకలో బిజెపి `ఆతిధ్యం’లో ఉన్నరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అదృశ్యమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరి జాడ మాత్రం తెలియడం లేదు. ఆదివారం తిరిగి వచ్చిన బిసాహులాల్‌తో మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆ రాష్ట్ర హోం మంత్రి బాలా బచ్చన్ ఆదివారం ప్రకటించడంతో బిజెపి శిబిరంలో ఉత్సాహం ఆవిరైపోయింది.

ఈ లోగా కొద్దిమంది బిజెపి ఎమ్యెల్యేలను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేస్తున్న ప్రయత్నాలు బిజెపి వర్గాలలో అలజడి రేపుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఒక ఎమ్యెల్యే అయితే బహిరంగంగానే బిజెపి నాయకత్వంపై దాడి చేశారు.

సంబంధిత వార్తలు