Artificial Intelligence Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ : ఐ రోబోట్ మూవీ నిజం కానుందా?

వాతావరణ మార్పుల వల్ల పడుతున్న ఇబ్బందుల కంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికంటే పెద్ద ప్రమాదాన్ని మానవాళికి కలిగిస్తుందని హింటన్ చెబుతున్నారు. క్లైమేట్ చేంజ్ కోసం కార్బన్ ఉధ్గారాలు తగ్గించాలని సిఫారసు చేయవచ్చు,కానీ కృత్రిమ మేథ విషయంలో క్లారిటీ లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కంటే ఇది అత్యవసరమని వారు భావిస్తున్నారు.

  • Written By: Bhaskar
  • Published On:
Artificial Intelligence Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ : ఐ రోబోట్ మూవీ నిజం కానుందా?

Artificial Intelligence Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం టేక్ రంగంలో వినిపిస్తున్న పేరు. చాట్ జిపిటికి ముందు ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సాంకేతికత వల్ల పలు ఉపయోగాలు ఉన్నాయని వాదించేవారు కొందరైతే, మానవ మనుగడకు ప్రతిబంధకంగా మారుతుందని ఆందోళన చెందే వారు మరి కొందరు. వాతావరణంలో మార్పుల కంటే కృత్రిమ మేధస్సు మానవాళికి గొప్ప మప్పుగా పరిణమిస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్తల్లో ఒకరైన జియో ఫ్రీ హింటన్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. టిఫిన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీలకమైన పరిశోధనలు చేసి, 2018లో ట్యూరింగ్ అవార్డు పొందిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకు కారణమవుతోంది.

యంత్రాలే సొంతం చేసుకుంటాయా?

“మానవుల కంటే అధిక మేధస్సును యంత్రాలు సొంతం చేసుకుంటాయని ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుస్తోంది. మొత్తం భూగ్రహం మీద అవి నియంత్రణ సాధించే అవకాశాలు కొట్టి పారేయలేనివి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుకు గొప్ప సాంకేతికత అయినప్పటికీ అది ఒక ఆస్తిత్వ ప్రమాదమే. దానికి ప్రతిగా ఏం చేయగలమో గుర్తించేందుకు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఐ సాంకేతికత వల్ల అందరూ ప్రభావితం అవుతారు. ఈ ప్రక్రియలో రాజకీయ నాయకులను కూడా భాగస్వామ్యం చేయాలి” జియో ఫ్రీ హింటన్ అభిప్రాయపడ్డాడు.

క్లైమేట్ చేంజ్ కంటే ఏఐ ప్రమాదకరం

వాతావరణ మార్పుల వల్ల పడుతున్న ఇబ్బందుల కంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికంటే పెద్ద ప్రమాదాన్ని మానవాళికి కలిగిస్తుందని హింటన్ చెబుతున్నారు. క్లైమేట్ చేంజ్ కోసం కార్బన్ ఉధ్గారాలు తగ్గించాలని సిఫారసు చేయవచ్చు,కానీ కృత్రిమ మేథ విషయంలో క్లారిటీ లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కంటే ఇది అత్యవసరమని వారు భావిస్తున్నారు.. జిపిటి_4 శక్తివంతమైన సిస్టమ్స్ అభివృద్ధి చేసేందుకు ఆరు నెలల విరామం ప్రకటించాలని ఇటీవల టెస్లా అధిపతి ఎలన్ మస్క్ సహా పలువురు ఇటీవల ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇందుకు మద్దతుగా సాంకేతికత భవిష్యత్తుపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యుల కమిటీ కోరడం కలకలం రేపింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వ్యవస్థాపకుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి ఆందోళన వ్యక్తం చేయడం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.

ఐ రోబోట్ సినిమాలో ఇలా జరిగింది

కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని తీసిన “ఐ రోబోట్” అనే సినిమా తీశారు తీశారు. సినిమాలో సాంకేతికత మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మనుషుల నా జీవితం కోసం కనిపెట్టిన సాంకేతికత చివరికి వారి ఆస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎదగడంతో.. చివరికి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకుంటారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి కూడా భవిష్యత్తు కాలంలో అలానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి విరుగుడు కనిపెట్టని పక్షంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.

Read Today's Latest Technology News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు