Mental Focus: పనిలో ఏకాగ్రత తగ్గుతోందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Mental Focus: మనలో పనులు చాలా మంది చేస్తారు. కానీ పని చేసే విధానంలో కొత్తదనం చూపించేవారే ముందుంటారు. చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తే ముందుకు సాగడం కష్టమే. చేసే పనిని దైవంగా భావిస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. చేసే పనిలో మంచి పనితనం చూపించేవారికి మంచి ఫలితాలు వస్తాయి. బద్ధకంగా ఉండే వారికి సరైన పేరు రాకుండా తిట్లు వస్తాయి. ఈ నేపథ్యంలో పనులు చేసే క్రమంలో మనం పొరపాట్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. […]

Mental Focus: మనలో పనులు చాలా మంది చేస్తారు. కానీ పని చేసే విధానంలో కొత్తదనం చూపించేవారే ముందుంటారు. చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తే ముందుకు సాగడం కష్టమే. చేసే పనిని దైవంగా భావిస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. చేసే పనిలో మంచి పనితనం చూపించేవారికి మంచి ఫలితాలు వస్తాయి. బద్ధకంగా ఉండే వారికి సరైన పేరు రాకుండా తిట్లు వస్తాయి. ఈ నేపథ్యంలో పనులు చేసే క్రమంలో మనం పొరపాట్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పని చేసేందుకు మనం కొన్ని పద్ధతులు పాటిస్తే కూడా మంచిది.

Mental Focus
మనం చేసే పని సరైన తీరుగా చేయాలంటే మన ఆరోగ్యం కూడా సహకరించాలి. సమయానికి నిద్ర పోవాలి. సరైన నిద్ర ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. చురుకుగా ఉంటూ మనం పని చేసుకుంటూ వెళ్తాం. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. చేసే పనిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. రోజులో కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోతేనే ప్రయోజనం ఉంటుంది. దీన్ని అందరు గమనించుకుని నిద్ర పోవడానికి తగిన సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఇబ్బందులు ఏర్పడతాయి.
వ్యాయామం కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రోజు వ్యాయామం చేస్తే మన శరీరం కూడా మనకు చెప్పినట్లు వింటుంది. దీంతో అలసట దరిచేరకుండా ఉంటే మనం పనులు చేసుకోవడం సులువు అవుతుంది. భోజనం కూడా సమయానికి చేయాలి. లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది. పనిమీద శ్రద్ధ పెరగాలంటే వేళకు భోజనం చేయడం కూడా అలవాటుగా మార్చుకోవాలి. పని మీద సరైన ధ్యాస ఉండాలంటే మనకు సమయానికి భోజనం చేయడం తప్పితే కష్టాలు తప్పవు.

Mental Focus
ధ్యానం చేయడం వల్ల ఆలోచనలు మెరుపులా వస్తాయి. ప్రతికూలతలు దూరం అవుతాయి. దీంతో ఏకాగ్రత కుదరదు. పని మీద ధ్యాస ఉండాలంటే ధ్యానం చేయడం మంచిది. మనల్ని కష్టాలకు గురిచేసే అలవాట్లను మార్చుకోవడమే సరైన మార్గం. పౌష్టికాహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే పోషకాలు ఉన్న వాటిని తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావు. పనిని బాధ్యతగా కూడా ఫీలవ్వాలి. అప్పుడే మనకు మన మీద సరైన పట్టు ఏర్పడుతుంది.
చేసే పనిని ఎప్పుడు కూడా వాయిదా వేయడం సరైంది కాదు. రేపు చేసే పని ఇవాళ చేయమంటారు. ఇవాళ చేసే పనిని ఇప్పుడే చేయమంటారు. అందుకే వాయిదాలు వేయడం కరెక్టు కాదు. పని మీదే పూర్తి ధ్యాస పెడితే ఎలాంటి సమస్యలు రావు. మానసికంగా ఏవైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. మన మానసిక స్థితి ప్రకారం నడుచుకుని ఇబ్బందుల లేని వాతావరణం ఏర్పరచుకుంటే మేలు.
