ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే మాత్రమే సంతోషంగా ఉంటారా.. నిపుణులేం చెప్పారంటే?
ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలపై పెళ్లికి సంబంధించి ఒత్తిడి పెరుగుతోంది. 26, 27 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకోవాలని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి ఆలస్యమైతే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వాస్తవాలను గమనిస్తే మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం వల్ల జీవితంలో ఏదో మిస్సైన […]

ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలపై పెళ్లికి సంబంధించి ఒత్తిడి పెరుగుతోంది. 26, 27 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకోవాలని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి ఆలస్యమైతే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే వాస్తవాలను గమనిస్తే మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం వల్ల జీవితంలో ఏదో మిస్సైన భావన కలిగే ఛాన్స్ ఉంటుంది. బాధ్యతలకు సిద్ధంగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. పెద్ద వయస్సులో బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
20 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకుంటే ప్రేమ గురించి అర్థం చేసుకునే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు. లేట్ వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలోని బాధలు అర్థం కావడంతో పాటు నిజమైన ప్రేమ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సులువుగా అర్థం కావడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవడానికి సైతం సిద్ధంగా ఉంటారు.
సమాజం గురించి పట్టించుకోకుండా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఈ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల విడిపొవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవని చెప్పాలి. పెళ్లి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి.
Recommended Videos
