BSP Tickets : ఆఖరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టికెట్లు అమ్ముకున్నాడా? వైరల్ ఆడియో

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్.. పోలీస్ గా సత్తా చాటాడు. అనంతరం తెలంగాణ గురుకుల బాధ్యతలు అప్పగిస్తే వాటిని దేశంలోకెల్లా మిన్నగా తీర్చిదిద్దాడు.

  • Written By: Raghava
  • Published On:
BSP Tickets : ఆఖరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టికెట్లు అమ్ముకున్నాడా? వైరల్ ఆడియో

BSP Tickets : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్.. పోలీస్ గా సత్తా చాటాడు. అనంతరం తెలంగాణ గురుకుల బాధ్యతలు అప్పగిస్తే వాటిని దేశంలోకెల్లా మిన్నగా తీర్చిదిద్దాడు. కేసీఆర్ సర్కార్ కే పేరు తెచ్చాడు. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ ఐపీఎస్ రూపొందించిన సిస్టం ఇప్పటికీ గురుకులాల్లో ఆదర్శంగా వాటిని అందరూ ఫాలో అవుతున్నారు.

ఈయన పెట్టిన సంఘాలు బలోపేతంగా ఉన్నాయి. ఇక ఐపీఎస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టాడు. అనంతరం బీఎస్పీలో చేరాడు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీని లీడ్ చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ కుమార్ పేరు అంటేనే నీతి నిజాయితీకి మారుపేరుగా ఆ వర్గం వారు.. బయట చూసిన వారు చెబుతుంటారు.

అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరిట తాజాగా ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆయన బీఎస్పీ పార్టీ తరుఫున ఓ బీఎస్పీ నేత.. టిక్కెట్లు ఆశించిన క్యాండిడేట్ కు ఫోన్ చేసి పార్టీ ఫండ్ గా రూ.10 లక్షలు… క్యాండిడేట్ ఫీజు రూ.25 వేలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టుగా ఓ ఆడియో వైరల్ అవుతోంది.

అయితే ఇది నిజమైన ఆడియోనా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడియోనా? లేక వేరే బీఎస్పీ నేత ఆయన పేరును వాడుకొని ఇలా దందా చేస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.

మొత్తంగా బీఎస్పీలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టికెట్ల దందా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు