Kushi Movie: ఖుషి సినిమాలో నిజంగా ఆ సీన్లు అవసరమా…
ముఖ్యంగా ఈ సినిమాకి మొదటి నుంచి హేషం అబ్దుల్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తూ వచ్చింది. వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ పాటల వలన ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి.

Kushi Movie: విజయ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా నిన్న విడుదల కాగా.. ప్రేక్షకుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ..బీ, సీ సెంటర్లో ప్రేక్షకులకు మాత్రం నిరాశను మిగిల్చింది అంటున్నారు సినీ వర్గాలు. మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో నిర్మించారు.
ముఖ్యంగా ఈ సినిమాకి మొదటి నుంచి హేషం అబ్దుల్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తూ వచ్చింది. వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ పాటల వలన ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఇక థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ తొలి షోతోనే కొన్ని దగ్గరలో పాజిటివ్ టాక్.. కొన్ని దగ్గరలో లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.. అసలు ఈ సీన్లు సినిమాలో అవసరమా అని అంటున్నారు.
ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ ఫైట్ సన్నివేశం ఒకటి ఉంది అందులో పాకిస్తాన్ వాళ్లతో విజయ దేవరకొండ బైక్ పైనే ఫైట్ చేస్తారు, అది అవసరం లేకున్నా సినిమాలో అదే పనిగా ఒక ఫైట్ కోసం పెట్టినట్లుగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా మూవీ సెకండాఫ్ లో హీరో తల్లిదండ్రులు హీరోయిన్ తల్లిదండ్రులు ఒకేసారి ఇంటికి వచ్చిన సన్నివేశంలో హీరో తండ్రికి మరియు హీరోయిన్ తండ్రికి మధ్య వచ్చే గొడవ.. అందులో డైలాగులు చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి అని కూడా కామెంట్ పెడుతున్నారు.
మరోపక్క ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్స్ గురించి ఆల్రెడీ ప్రేక్షకులు విపరీతంగా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ లిప్ లాక్ సీన్లు మాత్రం సినిమాకి అవసరమే అని దర్శకుడు శివ నిర్వాణ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.
