Cockroach Problems: బొద్దింకలు ఇంట్లో లేకుండా ఉండాలంటే ఇలా చేయండి
బొద్దింకలు రాకుండా ఉండటానికి రకరకాల కిల్లర్స్ వాడతాం. కానీ అవి చనిపోవు. మనల్ని చంపుతాయి. దీంతో వాటిని దూరం చేసుకునేందుకు సులభమైన చిట్కాలు ఉన్నాయి. బొద్దింకలకు పసుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుందట.

Cockroach Problems: ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే అసహ్యం కలుగుతుంది. వాటిని చూస్తేనే అదోలా అనిపిస్తుంది. అలాంటి బొద్దింకలు మన ఇంట్లో ఉండకూడదంటే ఏం చేయాలో తెలుసా? చాలా మంది ఏవో పౌడర్లు వాడతారు. కానీ వాటి వల్ల వచ్చే వాసన మనం భరించలేం. దీంతో అవి కనిపిస్తే చాలు మన ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి బొద్దింకలు ఇళ్లంతా తిరిగితే మనకు బాగుండదు. వాటిని దూరం చేసుకోవాలనే ఆలోచన మనలో కలగడం మామూలే. కానీ వాటిని ఎలా తొలగించాలి? ఏం చేయాలి? అనే ప్రశ్న రావడం సహజం.
బొద్దింకలు రాకుండా ఉండటానికి రకరకాల కిల్లర్స్ వాడతాం. కానీ అవి చనిపోవు. మనల్ని చంపుతాయి. దీంతో వాటిని దూరం చేసుకునేందుకు సులభమైన చిట్కాలు ఉన్నాయి. బొద్దింకలకు పసుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుందట. ఆ కలర్ కనిపిస్తే అవి తొందరగా వస్తాయట. అందుకే వంటింట్లో ఆ కలర్ కనిపించకుండా జాగ్రత్త పడాలి. అలా చేయడం వల్ల అవి అటు వైపు రాకుండా ఉంటాయి.
దోసకాయ వాసన అంటే బొద్దింకలకు పడదు. దోసకాయ ముక్కలు చేసి అక్కడక్కడ ఉంచితే కూడా బొద్దింకలు రావు. బొద్దింకలు వచ్చే చోట బోరిక్ పౌడర్ చల్లితే ఆ వాసనకు చనిపోతాయట. వాటిపై సబ్బు నీళ్లు పోస్తే కూడా అవి ప్రాణాలు విడుస్తాయి. ఇలా బొద్దింకలను దూరం చేసుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. వాటిని పాటించి వెళ్లగొట్టే ప్రయత్నం చేయాలి.
బోరిక్ పౌడర్, చక్కర పొడి, మొక్కజొన్న పిండి సమపాళ్లలో కలిపి బొద్దింకలు వచ్చే చోట పెడితే దాన్ని తిని చనిపోతాయి. ఇలా చేయడం వల్ల కూడా బొద్దింకలను దూరం చేసుకోవచ్చు. ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే మన పాత్రలను మరోమారు తోముకోవడం మంచిది. ఇలా బొద్దింకలను దూరం చేసుకోకపోతే మనకు రోగాలు రావడం గ్యారంటీ. దీంతో వాటిని దూరం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
